అతి తక్కువ ధరకే ఎల్ఈడీ టీవీలు.. ఇందులో ఒకటి రూ.రూ.4799 మాత్రమే!-top 3 led tvs at the lowest price one of these is only 4799 rupees without any offer ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అతి తక్కువ ధరకే ఎల్ఈడీ టీవీలు.. ఇందులో ఒకటి రూ.రూ.4799 మాత్రమే!

అతి తక్కువ ధరకే ఎల్ఈడీ టీవీలు.. ఇందులో ఒకటి రూ.రూ.4799 మాత్రమే!

Anand Sai HT Telugu

ఇంట్లోకి ఎల్ఈడీ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకు సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెజాన్ ఇండియాలో ఈ టీవీల ధర రూ.6,000లోపే ఉంది. ఈ జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.4799 మాత్రమే.

ప్రతీకాత్మక చిత్రం

ీరు తక్కువ బడ్జెట్లో కొత్త ఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాం. మీకు మూడు చౌకైన ఎల్ఈడీ టీవీల గురించి చెబుతాం. అమెజాన్ ఇండియాలో ఎలాంటి ఆఫర్ లేకుండా ఈ టీవీల ధర రూ.6,000 లోపే ఉంది. ఈ జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.4799 మాత్రమే. ఈ టీవీల్లో ధరను బట్టి మంచి డిస్‌ప్లే, సౌండ్ అవుట్ పుట్ లభిస్తుంది. ఏడాది వారంటీ లభిస్తుంది.

  1. వీడబ్ల్యూ 60 సెం.మీ (24 అంగుళాలు) ప్రీమియం సిరీస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ. విడబ్ల్యూ 24ఎ (బ్లాక్) అమెజాన్ ఇండియాలో ఎటువంటి ఆఫర్ లేకుండా కేవలం రూ.4799కు లభిస్తుంది. ఈ టీవీలో మీకు 24 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలు. 20 వాట్ల అవుట్ పుట్ ఉన్న ఈ టీవీలో కంపెనీ స్ట్రాంగ్ సౌండ్‌ను కూడా అందిస్తోంది. కనెక్టివిటీ కోసం మీరు టీవీలో హెచ్‌డీఎంఐ పోర్ట్, రెండు యూఎస్బీ పోర్ట్‌లను పొందుతారు. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.
  2. డైనోరా 60 సెం.మీ (24 అంగుళాలు) హెచ్‌డీ రెడీ నాన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ, మోడల్ డివై-LD24H0N (బ్లాక్). ఈ ఎల్ఈడీ టీవీ ధర అమెజాన్ ఇండియాలో రూ .5999. ఫీచర్ల విషయానికొస్తే 1366 x 768 పిక్సెల్ రిజల్యూషన్‌తో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను పొందుతారు. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ గా ఉంది. ఈ టీవీలో ఏప్లస్ గ్రేడ్ ప్యానెల్ ఉంది. బలమైన సౌండ్ కోసం ఇన్ బిల్ట్ బాక్స్ స్పీకర్లతో ఇది 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్‌ను కలిగి ఉంది. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.
  3. కొడాక్ 60 సెం.మీ (24 అంగుళాలు) స్పెషల్ ఎడిషన్ సిరీస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 24ఎస్ఈ5002 (బ్లాక్). ఈ టీవీ ధర రూ.5999. ఇందులో మీరు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడవచ్చు. కంపెనీ 20 వాట్ల అవుట్‌పుట్ కలిగిన సౌండ్‌ను అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఈ టీవీలో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. ఈ టీవీలో 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఈ టీవీకి ఏడాది వారంటీ లభిస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.