కొత్త కారు కొనాలని భావిస్తున్న వారికి కీలక అలర్ట్! ఇయర్ ఎండ్ కారణంగా వివిధ ఆటోమొబైల్ సంస్థలు తమ ప్రాడక్ట్స్పై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ఇచ్చాయి. కానీ ఈ పరిస్థితులు రేపు, అంటే జనవరి 1, 2025తో పూర్తిగా మారిపోబోతున్నాయి. ఆఫర్స్, డిస్కౌంట్స్ అందుబాటులో ఉండకపోవడమే కాదు.. అనేక ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలపై ధరలను భారీగా పెంచేందుకు కూడా రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీకు అర్జెంటుగా కొత్త కారు అవసరమని మీకు ఖచ్చితంగా అనిపిస్తే, రిజర్వేషన్ మొత్తాన్ని చెల్లించి మీ వాహనాన్ని బుక్ చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ ఛాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి!
దేశవ్యాప్తంగా, చాలా బ్రాండ్లలో డీలర్లు ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీలను క్లియర్ చేయడానికి ప్రత్యేక ఇయర్ ఎండ్ డీల్స్, డిస్కౌంట్లను అందిస్తున్నారు. మునుపటి సంవత్సరాల మాదిరిగా కాకుండా, ఈ సంవత్సరం ఇన్వెంటరీ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో పెద్దగా వెయిటింగ్ పీరియడ్ లేకుండానే కారును సులభంగా పొందొచ్చు. కానీ జనవరి 1 నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధాన కార్ బ్రాండ్లు (మాస్ మార్కెట్లో, లగ్జరీ స్పేస్లో) - జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ధరల పెంపును ప్రకటించాయి. ఈ ధరల పెరుగుదల రెండు శాతం నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది!
సంబంధిత కథనం