Today Gold Rate September 19 : నేటి బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే?-today gold rate gold and silver price on september 19th in hyderabad telangana vijayawada andhra pradesh ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate September 19 : నేటి బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే?

Today Gold Rate September 19 : నేటి బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంత ఉందంటే?

Anand Sai HT Telugu

Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు గురువారం కాస్త తగ్గాయి. వెండి ధర సైతం పడిపోయింది. తెలుగు రాష్ట్రాలతోపాటుగా దేశంలోని ఇతర నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

నేటి బంగారం ధరలు (REUTERS)

దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 తగ్గి రూ.68,490కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 68,500గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ.100 తగ్గి రూ. 6,84,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,849గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి రూ. 74720గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 74730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 తగ్గి రూ. 7,47,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,472గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,870గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,490 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 74,720గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,720గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 68,490గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 74,720గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 68,490గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,720గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.68,540గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,770గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 68,490గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 74,720గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు సైతం గురువారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9090గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 90,900గా కొనసాగుతోంది. బుధవారం ఈ ధర రూ. 91,000గా ఉండేది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ.95,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 90,900.. బెంగళూరులో రూ. 85,900గా ఉంది.

ప్లాటీనం ధరలు

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం కాస్త పడిపోయాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 270 తగ్గి రూ. 26,310కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 26,580గా ఉండేది. ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,310గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.