Today Gold Rate : నేటి బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate : దేశంలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి రేట్లలో కూడా మార్పులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
దేశంలో బంగారం ధరలు గురువారం పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం(10 గ్రాములు) ధర రూ.10 పెరిగి రూ.82,860కి చేరింది. మరోవైపు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ.10 పెరిగి.. రూ.75,960 చేరుకుంది. బుధవారం ఈ ధర రూ. 75,950గా ఉండేది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 7,596గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల వంద గ్రాముల బంగారం ధర రూ.7,59,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి(పది గ్రాములు) ధర రూ. 76,110గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 83,010గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 75,960 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 82,860గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ దాదాపు ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,960గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,860గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 75,960గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 82,860గాను ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,960గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,860గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,010గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,910గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 75,960గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,860గా ఉంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 96,400గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 96,500గా ఉండేది.
హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 1,03,900 పలుకుతోంది. పది గ్రాముల వెండి ధర రూ.1039గా ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 96,400.. బెంగళూరులో రూ. 96,400గా ఉంది.