TikTok ban in US : అమెరికాలో టిక్​టాక్​పై నిషేధం! ఆశలన్నీ ట్రంప్​పైనే..-tiktok ban in us removed from google and apple app stores ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tiktok Ban In Us : అమెరికాలో టిక్​టాక్​పై నిషేధం! ఆశలన్నీ ట్రంప్​పైనే..

TikTok ban in US : అమెరికాలో టిక్​టాక్​పై నిషేధం! ఆశలన్నీ ట్రంప్​పైనే..

Sharath Chitturi HT Telugu
Jan 19, 2025 11:31 AM IST

TikTok ban in US : అమెరికాలో టిక్​టాక్ పనిచేయడం లేదు. యాప్ స్టోర్ల నుంచి ఈ యాప్​ని తొలగించారు. ఇప్పుడు టిక్​టాక్​ ఆశలన్నీ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న డొనాల్డ్​ ట్రంప్​పైనే ఉన్నాయి.

అమెరికాలో టిక్​టాక్​పై నిషేధం!
అమెరికాలో టిక్​టాక్​పై నిషేధం! (AP)

ఊహించినదే జరిగింది! ప్రముఖ సోషల్​ మీడియా యాప్​ టిక్​టాక్​.. అమెరికాలో పనిచేయడం ఆపేసింది. అంతేకాదు, ఇప్పుడు ఈ యాప్​ ఇటు గూగుల్​, ఇటు యాపిల్​ యాప్​ స్టోర్స్​ నుంచి కూడా తీసేశారు. టిక్​టాక్​తో పాటు బైట్​డాన్స్​కి చెందిన క్యాప్​కట్, లెమన్8 వంటి యాప్స్​ని కూడా బ్యాన్​ అయ్యాయి. వాటిని ఆఫ్​లైన్​లో కూడా ఉపయోగించుకోవడానికి రావడం లేదు. తాజా పరిణామాల మధ్య బైట్​డాన్స్​ యాజమ్యం అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై కోటి ఆశలు పెట్టుకుంది.

yearly horoscope entry point

టిక్​టాక్​ ఓపెన్​ చేస్తే..

"టిక్​టాక్​ని నిషేధిస్తూ అమెరికా తీసుకొచ్చిన చట్టం జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. మా సేవలను తాత్కాలికంగా నిలచిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా యూఎస్​లో మా సేవలను పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాము. మీ మద్దతును మేము అభినందిస్తున్నాము. దయచేసి వేచి ఉండండి," అని టిక్​టాక్​ యాప్​లో నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయి.

“అధ్యక్షుడు ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత టిక్​టాక్​ని పునరుద్ధరించడానికి కృషి చేస్తారని, మాతో కలిసి పనిచేస్తారని సూచించడం మా అదృష్టం,” అని బైట్​డాన్స్​ యాజమాన్యంలోని యాప్ పేర్కొంది.

అమెరికాలో టిక్​టాక్​పై నిషేధం ఎందుకు?

గత ఏడాది అమల్లోకి వచ్చిన ఫెడరల్ చట్టం అమెరికాలో టిక్​టాక్​ కార్యకలాపాలపై గందరగోళం నెలకొంది. చైనా మాతృసంస్థ బైట్​డాన్స్​ నుంచి వైదొలగాలని, ఇందుకు 9 నెలల సమయం గడువును ఇస్తున్నట్టు.. లేకపోతే అమెరికాలో టిక్​టాక్​ నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని చట్టాలు హెచ్చరించాయి. ఆ తొమ్మిది నెలల గడువు జనవరి 19తో ముగిసింది.

సదరు ఫెడరల్ చట్టం అమెరికన్లందరి మొదటి సవరణ హక్కులను పరిమితం చేసిందని, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్​కి, తరువాత సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది టిక్​టాక్​.

కానీ టిక్​టాక్ అప్పీలును ఏకగ్రీవంగా తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. “170 మిలియన్లకు పైగా అమెరికన్లకు పర్సనలైజ్​డ్​, సమాజం కోసం విలక్షణమైన, విస్తృతమైన అవుట్​ని టిక్​టాక్​ అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ టిక్​టాక్​ డేటా సేకరణ పద్ధతులు, విదేశీ ప్రత్యర్థితో సంబంధాలకు సంబంధించి, జాతీయ భద్రతా ఆందోళనలను పరిష్కరించడానికి యాప్​ ఉపసంహరణ అవసరమని కాంగ్రెస్ నిర్ణయించింది,” అని పేర్కొంది.

ట్రంప్​ ఏమన్నారు..?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత టిక్​టాక్​ను 90 రోజుల పొడిగింపు ఇస్తానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

ఎన్​బీసీతో మాట్లాడిన ట్రంప్ 90 రోజుల పొడిగింపు చాలా వరకు జరుగుతుందని అన్నారు. “ఒకవేళ నేను అలా నిర్ణయించుకుంటే, బహుశా సోమవారం ప్రకటిస్తాను,” అని ట్రంప్​ స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, అమెరికాలో బయ్యర్స్​ని కనుగొనడానికి టిక్​టాక్​కి మరింత సమయం ఇవ్వాలని డెమొక్రాట్ సెనేట్ నాయకుడు చక్ షూమర్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం