108 ఎంపీ కెమెరాతో వచ్చే మూడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. రూ.12,000 లోపు ధరలోనే!-three best smartphones with 108mp camera available in india under 12000 rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  108 ఎంపీ కెమెరాతో వచ్చే మూడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. రూ.12,000 లోపు ధరలోనే!

108 ఎంపీ కెమెరాతో వచ్చే మూడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. రూ.12,000 లోపు ధరలోనే!

Anand Sai HT Telugu

సరసమైన ధరలో బెస్ట్ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. ఈ ఫోన్ల ధర రూ.12 వేల లోపు ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరాలను అందించే ఫోన్లపై ఆసక్తి చూపిస్తారు. అదే సమయంలో మీరు సరసమైన ధరలో ఉత్తమ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తే మీ కోసం మూడింటిని తీసుకొచ్చాం. ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోన్ల ధర రూ.12 వేల లోపు ఉంటుంది. మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ లభిస్తుంది. ఈ ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

టెక్నో పోవా 6 నియో

టెక్నో పోవా 6 నియో 5జీ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.11,999గా ఉంది. ఈ ఫోన్లో ఫోటోగ్రఫీ కోసం 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కంపెనీ అందిస్తోంది. కెమెరాలో ఎన్నో గొప్ప ఏఐ ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో వస్తుంది. దీంతో మొత్తం ర్యామ్ 12 జీబీకి పెరిగింది. ప్రాసెసర్‌గా డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఇన్ బిల్ట్ ఇన్ ఫ్రారెడ్, ఎన్ ఎఫ్ సీ కూడా లభిస్తాయి.

పోకో ఎం6 ప్లస్ 5జీ

పోకో ఎం6 ప్లస్ 5జీ 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ ఇండియాలో రూ.10,799గా నిర్ణయించారు. పోకోకు చెందిన ఈ ఫోన్లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. 8 జీబీ టర్బో ర్యామ్ ను సపోర్ట్ చేస్తుంది. మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరిగింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లేను చూడొచ్చు. ప్రాసెసర్ గా స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఉంది. 5030 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఓఎస్ విషయానికొస్తే ఈ ఫోన్ షియోమీ హైపర్ ఓఎస్ పై పనిచేస్తుంది.

రెడ్‌మీ 13 5జీ

రెడ్‌మీ 13 5జీ వేరియంట్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ లో రూ.11,889గా నిర్ణయించారు. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. వెనకవైపు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5030 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.