Thomson New Smart TVs: థామ్సన్ నుంచి కొత్తగా మూడు స్మార్ట్ టీవీలు లాంచ్: బడ్జెట్ ధరల్లోనే..-thomson fa series 32 inch hd 40 42 inch smart tvs launched ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Thomson New Smart Tvs: థామ్సన్ నుంచి కొత్తగా మూడు స్మార్ట్ టీవీలు లాంచ్: బడ్జెట్ ధరల్లోనే..

Thomson New Smart TVs: థామ్సన్ నుంచి కొత్తగా మూడు స్మార్ట్ టీవీలు లాంచ్: బడ్జెట్ ధరల్లోనే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 31, 2023 04:44 PM IST

Thomson New Smart TVs: థామన్స్ ఎఫ్ఏ సిరీస్‍లో కొత్త మూడు స్మార్ట్ టీవీలు లాంచ్ అయ్యాయి. ఇప్పటికే ఈ టీవీలు సేల్‍కు అందుబాటులో ఉన్నాయి.

Thomson New Smart TVs: థామ్సన్ నుంచి కొత్తగా మూడు స్మార్ట్ టీవీలు లాంచ్ (Photo: Thomson)
Thomson New Smart TVs: థామ్సన్ నుంచి కొత్తగా మూడు స్మార్ట్ టీవీలు లాంచ్ (Photo: Thomson)

Thomson New Smart TVs: థామ్సన్ ఎఫ్ఏ సిరీస్‍లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‍పీపీఎల్). 32 ఇంచులు, 40 ఇంచులు, 43 ఇంచుల డిస్‍ప్లేతో ఈ మోడళ్లు వచ్చాయి. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్‍‍పై ఈ టీవీలు రన్ అవుతాయి. 32 ఇంచుల మోడల్ హెచ్‍డీ రెజల్యూషన్ డిస్‍ప్లేను కలిగి ఉండగా.. మిగిలిన రెండు మోడళ్లు ఫుల్ హెచ్‍డీ డిస్‍ప్లేతో వచ్చాయి. 30 వాట్స్ సౌండ్ ఔట్‍పుట్ ఉంటుంది. ఈ థామ్సన్ ఎఫ్ఏ టీవీల గురించిన వివరాలివే.

థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ స్మార్ట్ టీవీల ధరలు, సేల్

థామ్సన్ ఎఫ్ఏ సిరీస్‍లో 32 ఇంచులు మోడల్ ధర రూ.10,499గా ఉంది. 40 ఇంచుల మోడల్ ధర రూ.15,999, 43 ఇంచుల మోడల్ ధర రూ.16,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ టీవీలు సేల్‍కు అందుబాటులో ఉన్నాయి.

థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ స్మార్ట్ టీవీల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

థామ్సన్ ఎఫ్ఏ సిరీస్ 32 ఇంచుల మోడల్ హెచ్‍డీ రెడీ (1366x768 పిక్సెల్స్) రెజల్యూషన్ డిస్‍ప్లేను కలిగి ఉంది. 40 ఇంచుల డిస్‍ప్లే, 43 ఇంచుల డిస్‍ప్లే మోడల్స్ ఫుల్ హెచ్‍డీ (1920x1080 పిక్సెల్స్) రెజల్యూషన్‍తో వచ్చాయి. ఈ టీవీల్లో మీడియాటెడ్ ఏ53 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. మాలి-450 జీపీయూ ఉంది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ టీవీలు వచ్చాయి.

30 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ థామ్సన్ ఎఫ్‍ఏ సిరీస్ మూడు స్మార్ట్ టీవీల్లో ఉన్నాయి. డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ ట్రూసరౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ఉంటుంది. నెట్‍ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‍స్టార్ సహా పాపులర్ ఓటీటీలకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. మిగిలిన సపోర్ట్ చేసే యాప్స్, గేమ్‍లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. గూగుల్ క్రోమ్‍కాస్ట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్‍ ఫీచర్లు కూడా ఉంటాయి.

వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్‍లను థామ్సన్ ఎఫ్‍ఏ సిరీస్ స్మార్ట్ టీవీలు కలిగి ఉన్నాయి. మూడు హెచ్‍డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‍బీ పోర్టులు ఉంటాయి.

కాగా, ఇటీవలే థామ్సన్ ఓథ్ ప్రో మ్యాక్స్ 4కే టీవీలు కూడా లాంచ్ అయ్యాయి. 50 4కే ఇంచుల ఈ టీవీ ధర రూ.27,999గా ఉంది. ఇదే సిరీస్‍లో 43 4కే ఇంచుల మోడల్ ధర రూ.22,999గా ఉంది. ఇవి కూడా ఫ్లిప్‍కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Whats_app_banner