Multibagger Stock : ఇన్వెస్టర్ల జేబులు నింపిన మల్టీబ్యాగర్ స్టాక్.. ఏడాది కాలంలో 750 శాతం లాభాలు!
Eraaya Lifespaces Multibagger Stock : ఎరాయ లైఫ్ స్పేసెస్ మల్టీబ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్లకు అధిక రాబడులను అందించింది. ఏడాది కాలంలో 750 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందాలనే ఆశతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే కొన్ని స్టాక్స్ దూసుకెళ్తే.. మరికొన్ని కిందపడేస్తాయి. చాలా కంపెనీ స్టాక్‌లు పెట్టుబడిదారులకు అంచనాలకు మించిన లాభాలను అందిస్తాయి. అలాంటివాటిలో ఒకటి ఎరాయ లైఫ్‌స్పేసెస్.
స్మాల్ క్యాప్ స్టాక్ ఎరాయ లైఫ్‌స్పేసెస్ గత ఏడాదిలో మల్టీబ్యాగర్ లాభాలను అందించింది. ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 750 శాతానికి పైగా లాభాలను అందించింది. కంపెనీ నిలకడగా లాభాలను ఆర్జించడం, కొత్త ఆర్డర్‌లను పొందడం దీనికి కారణంగా ఉంది. కంపెనీ వృద్ధి బాగుంటడంతో ఇన్వెస్టర్లు కూడా దీనివైపు మెుగ్గుచూపిస్తున్నారు.
ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో వరుసగా ఆరో ట్రేడింగ్ రోజు(శుక్రవారం జనవరి 17) కంపెనీ షేరు ధర 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌కు చేరుకుంది. నిన్న ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేరు ధర 5 శాతం పెరిగి వరుసగా 7వ ట్రేడింగ్ రోజు అప్పర్ సర్క్యూట్‌కు చేరుకుంది. ఈరోజు కూడా కంపెనీ షేరు ధర 5 శాతం పెరిగి ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. నేడు షేరు ధర రూ.6.55 పెరిగి రూ.137.60కి చేరుకుంది. కంపెనీ షేరు ధర పెరుగుతూనే ఉండడంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత నెల కేఎస్ఆర్టీసీ.. స్మార్ట్ ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్‌తో సహా సమగ్ర టికెటింగ్ సేవల కోసం దాని భారతీయ అనుబంధ సంస్థ EpixCashని ఎంచుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఎరాయ లైఫ్‌స్పేసెస్ అనుబంధ సంస్థకు 33.5 కోట్ల ఆర్డర్ వచ్చింది. సంస్థ వ్యాపార కార్యకలాపాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇది సంస్థకు బలంగా మారింది. ఇలాంటి కారణాలతోనే కంపెనీ స్టాక్ స్వల్పకాలంలో మల్టీబ్యాగర్ లాభాలను ఇచ్చింది.
గత ఒక సంవత్సరంలో ఎరాయ లైఫ్‌స్పేసెస్ షేరు ధర 756 శాతం పెరిగింది. 2 సంవత్సరాలలో స్టాక్ పెట్టుబడిదారులకు 14,461 శాతం రాబడిని ఇచ్చింది. గత 3 సంవత్సరాలలో ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 15,881 శాతం రాబడిని తెచ్చింది. కంపెనీలో ప్రమోటర్ల కంటే ప్రజలకే ఎక్కువ వాటా ఉంది. కంపెనీలో 35.2 శాతం షేర్లను ప్రమోటర్లు కలిగి ఉండగా, షేర్లలో పబ్లిక్ 36.7 శాతం వాటాలను కలిగి ఉన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం 26.83 శాతం షేర్లను కలిగి ఉన్నారు.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహా తీసుకోండి.