గత సంవత్సరంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించిన స్టాక్‌లలో పీసీ జ్యువెలర్ లిమిటెడ్ ఒకటి. స్టాక్ 400 శాతానికి పైగా లాభపడింది. సోమవారం తొలి సెషన్‌లోనూ ఈ షేరు మంచి పురోగతిని సాధించింది. త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత స్టాక్ జోరందుకుంది. ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ధర రూ.175.70గా(3 PM)గా ఉంది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 7.39 శాతం లాభపడగలిగింది. ఒక నెల వృద్ధి 20.04 శాతంగా ఉంది. ఆరు నెలల్లో 222.27 శాతం లాభంతో ఇన్వెస్టర్ల జేబులు కూడా నింపగలిగింది. 2024లో ఇప్పటివరకు పీసీ షేర్ 250 శాతం లాభపడింది.
గత ఏడాది కాలంలో ఈ షేరు 491 శాతం లాభపడింది. షేరు 52 వారాల గరిష్టం రూ.186.80, 52 వారాల కనిష్టం రూ.27.66గా ఉంది. త్రైమాసిక ఫలితాలు FY25లో నికర అమ్మకాలు 12.4 శాతం పెరిగి రూ.504.97 కోట్లకు చేరుకున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 138.13 కోట్లతో పోలిస్తే 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 178.88 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 230 శాతం పెరిగింది.
అర్ధ సంవత్సర ఫలితాలు FY 2024తో పోలిస్తే 2025 FY మొత్తం అమ్మకాలు 75.3 శాతం పెరిగి రూ.906.12 కోట్లకు చేరుకున్నాయి. 2024లో రూ. 309.75 కోట్ల నికర నష్టంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ రూ.334.94 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
కంపెనీ మార్కెట్ విలువ 8,400 కోట్ల కంటే ఎక్కువ. సెప్టెంబర్ 2024 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కంపెనీలో 1.45 శాతం వాటాను కలిగి ఉంది. FIIలు 34,91,555 షేర్లను కొనుగోలు చేశారు. జూన్ 2024లో 2.57 శాతంతో పోలిస్తే వారి వాటాను 3.31 శాతానికి పెంచారు.
ప్రస్తుత 1 ఈక్విటీ షేర్‌ను రూ. 10 ముఖ విలువ కలిగిన 10 చిన్న షేర్‌లుగా విడదీసే ప్రణాళికలను ప్రకటించింది పీసీ జ్యువెలర్స్. స్టాక్ స్ప్లిట్ కోసం రికార్డు తేదీ ఇంకా నిర్ణయించలేదు.
పీసీ జ్యువెలర్స్ అనేది బంగారం, ప్లాటినం, డైమండ్, వెండి ఆభరణాల తయారీ, విక్రయం, వ్యాపారం చేసే భారతీయ కంపెనీ. అనేక బ్రాండ్లతో భారత్‌లో పని చేస్తున్నారు. విస్తృతమైన షోరూమ్‌ల నెట్‌వర్క్, తయారీ సామర్థ్యాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కస్టమర్-సెంట్రిక్ విధానాలతో కంపెనీకి బలంగా ఉంది.
గమనిక : ఇది కేవలం స్టాక్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టండి.