Most unsafe Tata car : ఈ టాటా ఫ్యామిలీ కారుకు '0' సేఫ్టీ రేటింగ్​- మీరు వాడుతున్నారా?-this is the most unsafe tata car in india check shock details here tata nano safety details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Most Unsafe Tata Car : ఈ టాటా ఫ్యామిలీ కారుకు '0' సేఫ్టీ రేటింగ్​- మీరు వాడుతున్నారా?

Most unsafe Tata car : ఈ టాటా ఫ్యామిలీ కారుకు '0' సేఫ్టీ రేటింగ్​- మీరు వాడుతున్నారా?

Sharath Chitturi HT Telugu

Most unsafe cars in India : భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే టాటా మోటార్స్​కి ఒక 'మోస్ట్​ అన్​సేఫ్​ కారు' ఉందని మీకు తెలుసా? క్రాష్​ టెస్ట్​లో ఆ కారుకు 0 సేఫ్టీ రేటింగ్​ వచ్చిందని మీకు తెలుసా? అదే టాటా నానో.. వివరాల్లోకి వెళితే..

మోస్ట్​ అన్​సేఫ్​ టాటా కారు ఇదే..

టాటా గ్రూప్​ నమ్మకానికి మారుపేరు! మరీ ముఖ్యంగా టాటా మోటార్స్​ నుంచి వచ్చే వెహికిల్స్​లో సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తారని ప్రజల్లో నమ్మకం ఉంటుంది. ఇటీవలి కాలంలో దాదాపు అన్ని వెహికిల్స్​కి క్రాష్​ టెస్టుల్లో 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ లభిస్తోంది. కానీ.. టాటా మోటార్స్​కి కూడా ఒక 'మోస్ట్​ అన్​సేఫ్​ కారు' ఉందని మీకు తెలుసా? దానికి క్రాష్​ టెస్ట్​లో 0 రేటింగ్​ వచ్చిందని మీకు తెలుసా? అదే టాటా నానో!

టాటా నానో సేఫ్టీలో 0..!

సొంత కారు కొనాలన్న సామాన్యుడి కలను నెరవేర్చి, తక్కువ ధరకే మంచి ఫ్యామిలీ వెహికిల్​ని తీసుకురావాలన్న దిగ్గజ వ్యాపారవేత్త, దివంగత రతన్​ టాటా సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందే టాటా నానో! రూ. 1లక్ష ధరతో ఉండే ఈ కారు 2009లో లాంచ్​ అయ్యింది. కానీ ఇండియాలో హిట్​ అవ్వలేదు! చివరికి 2020లో దీనిని టాటా మోటార్స్​ డిస్కంటిన్యూ చేసింది.

అయితే, ఈ టాటా నానో క్రాష్​ టెస్ట్​లో ఆందోళనక డేటా బయటకు వచ్చింది. 2014లో టాటా నానో బేస్​ వేరియంట్​పై గ్లోబల్​ ఎన్​సీఏపీ టెస్ట్​ని నిర్వహించారు. ఇందులో ఎయిర్​బ్యాగులు లేవు! కేవలం 64 కేఎంపీహెచ్​ స్పీడ్​తో క్రాష్​ టెస్ట్​ చేస్తే, కారు నుజ్జునుజ్జు అయ్యింది! చైల్డ్​ ఆక్యుపెంట్​, అడల్ట్​ ఆక్యుపెంట్​ ప్రొటెక్షన్​లో ఈ కారుకు 0 రేటింగ్​ లభించింది. అంతేకాదు కారు బాడీషెల్​ కూడా స్థిరంగా లేదని గుర్తించారు.

అయితే, ఇది 2014 నాటి కథ! ఇప్పుడు మాత్రం ఇండియాలోనే మోస్ట్​ సేఫెస్ట్​ కార్లను టాటా మోటార్స్​ తయారు చేస్తోంది. అటు గ్లోబల్​ ఎన్​సీఏపీ టెస్ట్​లో, ఇటు భారత్​ ఎన్​సీఏపీ టెస్ట్​లో దాదాపు అన్ని టాటా వెహికిల్స్​కి 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ లభిస్తోంది. ఫలితంగా, ప్రజల భద్రతకు టాటా మోటార్స్​ ఏ విధంగా కట్టుబడి ఉందో స్పష్టమవుతోంది.

కానీ ఈ కార్లలో ఇంకా.. 0 సేఫ్టీ రేటింగ్​..!

టాటా నానో ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది. ఈ మోడల్​ని వాడుతున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది! కానీ దేశంలో ఉన్న కొన్ని వెహికిల్స్​లో ఇప్పటికీ 0 సేఫ్టీ రేటింగ్​ కనిపిస్తోంది. అవి..

మారుతీ వాగన్​ఆర్​:-

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ హ్యాచ్​బ్యాక్స్​లో ఒకటైన వాగన్​ఆర్​.. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో దారుణంగా విఫలమైంది. ఈ వాగన్​ఆర్​కు చైల్డ్​ ప్రొటెక్షన్​ టెస్ట్​లో జీరో రేటింగ్​ వచ్చింది. మొత్తం మీద దీనికి ఒక్కటంటే.. ఒక్కటే స్టార్​ లభించింది.

రెనాల్ట్​ క్విడ్​:-

రెనాల్ట్​కి.. ఇండియాలో ఎంట్రీ లెవల్​ హ్యచ్​బ్యాక్​గా ఉంది క్విడ్​. సేల్స్​ పరంగా.. సంస్థకు ఇది మోస్ట్​ సక్సెస్​ఫుల్​ వెహికిల్​ అనే చెప్పుకోవాలి. కానీ.. సేఫ్టీ విషయంలో మాత్రం రెనాల్ట్​ క్విడ్​ డీలా పడింది. గ్లోబల్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​ అడల్ట్​ ప్రొటెక్షన్​, చైల్డ్​ ప్రొటెక్షన్​లో కేవలం 1 స్టార్​ మాత్రే దక్కించుకుంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం