టాటా ఎలక్ట్రిక్ కార్లకు భారతీయ వినియోగదారుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీంతో కంపెనీ పలు మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. టాటా హారియర్ ఈవీని ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో కూడా ప్రదర్శించారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం హారియర్ ఈవీ జూన్ 3న మార్కెట్లోకి విడుదల కానుంది. హారియర్ ఈవీ మార్కెట్లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసుకుందాం.
హారియర్ ఈవీలో మల్టీ లింక్ సస్పెన్షన్ ఉంది. ఈవీలో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. లోయర్ బంపర్‌పై ఉన్న వర్టికల్ స్లాట్స్ అత్యంత ఆకర్షణీయమైన అప్ డేట్. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్నాయి. ఇది కాకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనం ఏడీఏఎఎస్ ఎల్ 2 ప్లస్ వంటి భద్రతా ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.
మల్టీ-లింక్ సస్పెన్షన్‌తో ఈవీ ఆఫ్-రోడ్ ట్రాక్ లను మెరుగ్గా నిర్వహించగలదు. ఈవీలో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. హారియర్ ఈవీ టాప్ వేరియంట్లలో 19 అంగుళాల చక్రాలు ఉండవచ్చు.
పవర్ట్రెయిన్ గురించి చూస్తే.. టాటా హారియర్ ఈవీ 75 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాక ఈ ఎస్‌యూవీలో చిన్న బ్యాటరీ యూనిట్ కూడా ఉంటుంది. హారియర్ ఈవీలో డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ వస్తుంది. రెండు యాక్సిల్స్లో మోటార్లను అమర్చారు. హారియర్ ఈవీ పూర్తి ఛార్జింగ్‌తో వినియోగదారులకు 500 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.