డిసెంబర్ నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ ఇదే.. టాప్ 10 లిస్ట్ చూసేయండి!
Maruti Suzuki Brezza : భారతీయ కస్టమర్లలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత నెలలో ఈ సెగ్మెంట్ అమ్మకాల్లో మారుతి సుజుకి బ్రెజ్జా అగ్రస్థానంలో నిలిచింది.
భారతీయ కస్టమర్లలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు ఎక్కువే ఉంటుంది. 2024 డిసెంబర్ నెలలో చూసుకుంటే.. మారుతి సుజుకి బ్రెజ్జా టాప్‌లో ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా 2024 డిసెంబర్ నెలలో నెలలో మొత్తం 17,336 యూనిట్లను విక్రయించింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ సంఖ్య మొత్తం 12,844 యూనిట్లుగా ఉంది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎస్ యూవీలపై ఓ లుక్కేద్దాం.
టాటా పంచ్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎస్‌యూవీగా నిలిచింది. ఈ కాలంలో టాటా పంచ్ మొత్తం 15,073 యూనిట్లను విక్రయించింది. ఇది సంవత్సరానికి 9 శాతం వృద్ధి చెందింది. ఈ అమ్మకాల జాబితాలో టాటా నెక్సాన్ మూడో స్థానంలో ఉంది. టాటా నెక్సాన్ 11 శాతం వార్షిక క్షీణతతో 13,536 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది కాకుండా హ్యుందాయ్ క్రెటా ఈ అమ్మకాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. హ్యుందాయ్ క్రెటా ఈ కాలంలో 12,608 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. ఇది సంవత్సరానికి 36 శాతం వృద్ధి చెందింది.
మహీంద్రా స్కార్పియో ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. మహీంద్రా స్కార్పియో మొత్తం 12,195 యూనిట్ల ఎస్‌యూవీలను అమ్మకాలు చేసింది. ఈ కాలంలో 7 శాతం వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. మారుతి సుజుకి గత నెలలో 10,752 యూనిట్లను విక్రయించింది. ఇది ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధి సాధించింది. ఈ అమ్మకాల జాబితాలో హ్యుందాయ్ వెన్యూ ఏడో స్థానంలో ఉంది. హ్యుందాయ్ 1 శాతం వృద్ధితో 10,265 యూనిట్లను విక్రయించింది.
ఈ అమ్మకాల్లో మహీంద్రా థార్ 30 శాతానికి పైగా వృద్ధితో ఎనిమిదో స్థానంలో ఉంది. మహీంద్రా థార్ 32 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 7,659 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ మొత్తం 7,337 యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ నెలలో గ్రాండ్ విటారా మొత్తం 7,093 యూనిట్లను విక్రయించింది, ఇది సంవత్సరానికి 2 శాతం వృద్ధిని సాధించింది.
MODEL | UNITS |
---|---|
Maruti Suzuki Brezza | 17,336 |
Tata Punch | 15,073 |
Tata Nexon | 13,536 |
Hyundai Creta | 12,608 |
Mahindra Scorpio | 12,195 |
Maruti Suzuki Fronx | 10,752 |
Hyundai Venue | 10,265 |
Mahindra Thar | 7,659 |
Mahindra XUV 700 | 7,337 |
Maruti Suzuki Grand Vitara | 7,093 |