ఈ బడ్జెట్ కారు మే నెల అమ్మకాల్లో దేశంలో నెంబర్ వన్.. టాప్ 10 సేల్స్ లిస్ట్ చూసేయండి!-this budget car is number one in the country in sales for the month of may 2025 check out the top 10 sales list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ బడ్జెట్ కారు మే నెల అమ్మకాల్లో దేశంలో నెంబర్ వన్.. టాప్ 10 సేల్స్ లిస్ట్ చూసేయండి!

ఈ బడ్జెట్ కారు మే నెల అమ్మకాల్లో దేశంలో నెంబర్ వన్.. టాప్ 10 సేల్స్ లిస్ట్ చూసేయండి!

Anand Sai HT Telugu

మే నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాను వచ్చింది. ఈ జాబితా మరోసారి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మారుతి డిజైర్ గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

మే నెల కార్ల అమ్మకాలు

మే నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల లిస్ట్ వచ్చింది. మే నెలలో మారుతి డిజైర్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. మారుతి ఎర్టిగా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్, టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా వంటి అన్ని మోడళ్లు ఈ సెడాన్‌కు డిమాండ్ ముందు తక్కువే అయ్యాయి. మారుతికి చెందిన 6 మోడళ్లను ఈ జాబితాలో ఉన్నాయి. టాటాకు చెందిన 2 మోడళ్లు, హ్యుందాయ్, మహీంద్రా చెరో మోడల్ ఈ జాబితాలో ఉన్నాయి.

టాప్ 10 కార్లు

1. మారుతి సుజుకి డిజైర్-18,084

2. మారుతి సుజుకి ఎర్టిగా-16,140

3. మారుతి సుజుకి బ్రెజ్జా - 15,566

4. హ్యుందాయ్ క్రెటా - 14,860

5. మహీంద్రా స్కార్పియో - 14,401

6. మారుతి సుజుకి స్విఫ్ట్ - 14,135

7. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - 13,949

8. మారుతి సుజుకి ఫ్రాంక్స్ - 13,584

9. టాటా పంచ్ - 13,133

10. టాటా నెక్సాన్ - 13,096

మారుతి డిజైర్ ఫీచర్లు

డిజైర్ ప్రారంభ ధర రూ.6.84 లక్షలు. ఈ బడ్జెట్ కారు గురించి తెలుసుకుందాం.. కొత్త డిజైర్ దాని అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, హారిజాంటల్ డీఆర్‌ఎల్‌లతో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, బహుళ సమాంతర స్లాట్ లతో వెడల్పాటి గ్రిల్, రీడిజైన్ చేసిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లతో ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే దీని సిల్హౌట్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. షార్క్ ఫిన్ యాంటెనా, బూట్ లిడ్ స్పాయిలర్, క్రోమ్ స్ట్రిప్‌కు జత చేసిన వై ఆకారంలోని ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఇతర ఫీచర్లు ఉన్నాయి.

డిజైర్ ఇంటీరియర్ డ్యాష్ బోర్డ్ పై గోధుమ, నలుపు థీమ్ కలిగి ఉంది. అనలాగ్ డ్రైవర్ డిస్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్ లెస్ కంపాటబిలిటీతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్, వెనుక వెంట్‌లతో ఎయిర్ కండిషనింగ్, సింగిల్ ప్యాన్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మారుతి సుజుకి సవరించిన కాంపాక్ట్ సెడాన్ రియర్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఇఎస్సి), 6 ఎయిర్ బ్యాగులు(స్టాండర్డ్), 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

కొత్త డిజైర్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 80 బీహెచ్‌పీ పవర్, 112ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లలో లాంచ్ కానుంది. గ్లోబల్ ఎన్సీఏపీలో భద్రత కోసం కంపెనీ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి కారుగా డిజైర్ నిలిచింది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.