FD rate hike : ఎఫ్డీపై దాదాపు 9శాతం వడ్డీ ఇస్తున్న ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
Fincare Small Finance Bank : ఎఫ్డీపై దాదాపు 9శాతం వడ్డీని ఇస్తోంది ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సీనియర్ సిటిజెన్లకు ఇది వర్తిస్తుంది. పూర్తి వివరాలు..
Fincare Small Finance Bank FD : ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతోంది. ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను ఇటీవలే మరోమారు పెంచింది. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రజల చూపు ఎఫ్డీలపై పడింది. డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంక్‌ల కోసం ప్రజలు చూస్తున్నారు. ఈ తరుణంలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఎఫ్డీపై వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంక్‌లో.. సీనియర్ సిటిజెన్లకు ఇప్పుడు దాదాపు 9శాతం వడ్డీ రేటు లభిస్తోంది.
ఎఫ్డీలపై వడ్డీ రేట్లు పెంపు..
ప్రజల సేవింగ్స్ పోర్ట్‌ఫోలియోను మరింత శక్తివంతంగా మార్చేందుకు తమ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచినట్టు ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెల్లడించింది. తాజా మార్పులు.. సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలకు.. వడ్డీ రేటు 8.11శాతంగా ఉంది. ఇక సీనియర్ సిటిజెన్లకు అది 8.71శాతానికి (మినిమమ్ డిపాజిట్ రూ.5వేల) చేరింది.
Fincare Small Finance Bank FD rates :"కస్టమర్లకు మెరుగైన ఆర్థిక సేవలను అందించేందుకు మేము నిత్యం కృషిచేస్తాము. కస్టమర్ల దీర్ఘకాలిక అవసరాల కోసం మా చర్యలు ఉపయోగపతాయి. ఇందులో భాగంగానే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నాము," అని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీఓఓ ఆశిష్ మిశ్రా తెలిపారు. 'సుపీరియర్ బ్యాంకింగ్, కస్టమర్ ఆధారిత సేవల'కు తమ బ్యాంక్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 2023లో ‘ఇన్వెస్ట్మెంట్’ టిప్స్.. మీకోసం!
ఆసక్తి ఉన్న కస్టమర్లు తమ సమీపంలోని ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంచ్‌కి వెళ్లొచ్చు. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా ఎఫ్డీని పొందవచ్చు.
దేశవ్యాప్తంగా కార్యకలాపాలు..
Fincare Small Finance Bank services : కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, గోల్డ్ లోన్, ప్రాపర్టీ లోన్, హోం లోన్ వంటి సేవలను కస్టమర్లకు అందిస్తోంది ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దేశవ్యాప్తంగా ఈ బ్యాంక్‌కు అనేక బ్రాంచ్‌లు ఉన్నాయి. 2022 మార్చ్ 31 నాటికి.. దేశవ్యాప్తంగా ఈ బ్యాంక్కుకు 32లక్షలకుపైగా కస్టమర్లు ఉన్నారు. 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 12వేలకుపైగా ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు.
ఎఫ్‌డీల్లో రిటర్నులు తక్కువగా ఉంటాయి. కానీ వీటిల్లో రిస్క్ ఉండకపోవడంతో చాలా మంది ఎఫ్డీలవైపే మొగ్గుచూపుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో ఎఫ్డీలపై మంచి వడ్డీ వస్తోందని నిపుణులు చెబుతున్నారు.