5ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్స్​ ఇవి! ఇన్వెస్టర్స్​ ఫుల్​ ఖుష్​..-these value mutual funds delivered over 25 returns in past five years see list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్స్​ ఇవి! ఇన్వెస్టర్స్​ ఫుల్​ ఖుష్​..

5ఏళ్లల్లో 25శాతం కన్నా ఎక్కువ రిటర్నులు ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్స్​ ఇవి! ఇన్వెస్టర్స్​ ఫుల్​ ఖుష్​..

Sharath Chitturi HT Telugu

మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? 5ఏళ్లల్లో 25శాతం కన్నా అధిక రిటర్నులు ఇచ్చిన వాల్యూ మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

25శాతం కన్నా అధిక రిటర్నులు ఇచ్చిన వాల్యూ మ్యూచువల్​ ఫండ్స్​

మీరు మ్యూచువల్​ ఫండ్స్​తో మీ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించాలని చూస్తున్నారా? కానీ మార్కెట్​లో ఉన్న చాలా ఆప్షన్స్​లో ఏది ఎంపిక చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇది మీకోసమే! మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడికి ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సాధారణంగా సంబంధిత ఫండ్​ గత ప్రదర్శనను చూసి, భవిష్యత్తులో ఎలాంటి రిటర్నులు వస్తాయి అనేది అంచనా వేస్తుంటారు. ఈ నేపథ్యంలో 5ఏళ్లల్లో 25శాతం కన్నా అధిక రిటర్నులు ఇచ్చిన ‘వాల్యూ’ మ్యూచువల్​ ఫండ్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వాల్యూ మ్యూచువల్​ ఫండ్స్​..

వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ అనేది కనీసం 65 శాతం స్టాక్స్​తో వాల్యూ ఇన్వెస్ట్​మెంట్ స్ట్రాటజీని అనుసరించే స్కీమ్స్. స్టాక్ ఎంపికలో సాధారణంగా అవలంబించే వాల్యుయేషన్ పారామీటర్ల ఆధారంగా ఈక్విటీ ఫండ్లను వర్గీకరించవచ్చు. ఒకటి గ్రోత్ ఫండ్స్- ఇవి మార్కెట్ కంటే మెరుగైన పనితీరు కనబరుస్తాయని భావిస్తున్న మొమెంటమ్ స్టాక్స్​ని గుర్తిస్తాయి.

ఇంకొకటి వాల్యూ ఫండ్స్- ఇవి ప్రస్తుతం అండర్​వాల్యూలో ఉన్న స్టాక్స్​ని గుర్తిస్తాయి. కానీ వీటి విలువ రానున్న కాలంలో అన్​లైక్​ అయ్యి స్టాక్స్​ పెరుగుతాయన్న అంచనాలతో వీటిల్లో పెట్టుబడి పెడుతుంటారు.

మొత్తం మీద 2025 మార్చ్​ 31 నాటికి రూ.1.83 లక్షల కోట్ల ఆస్తుల పరిమాణం కలిగిన 24 వాల్యూ/కాంట్రా పథకాల వివరాలను చూసేయండి..

వాల్యూ మ్యూచువల్​ ఫండ్స్​5ఏళ్ల రిటర్నులు (%)
Aditya Birla Sun Life Pure Value Fund 25.89
Bandhan Sterling Value Fund 32.79
HDFC Value Fund 25.50
HSBC Value Fund 28.76
ICICI Pru Value Discovery 29.78
JM Value Fund 28.02
Nippon India Value Fund 29.03
Templeton India Value Fund 30.41

పై పట్టికలో మనం చూడగలిగినట్లుగా, గత ఐదేళ్లలో ఎనిమిది మ్యూచువల్ ఫండ్స్​ 25 శాతానికి పైగా వార్షిక రాబడిని అందించాయి. బంధన్ స్టెర్లింగ్ వాల్యూ ఫండ్ గత ఐదేళ్లలో 32.79 శాతం, టెంపుల్టన్ ఇండియా వ్యాల్యూ ఫండ్ 30.41 శాతం రిటర్నులు ఇచ్చాయి. 25 శాతానికి పైగా రాబడి ఇచ్చిన ఇతర పథకాలు జేఎం వాల్యూ ఫండ్, నిప్పాన్ ఇండియా వ్యాల్యూ ఫండ్.

ఇన్వెస్టర్స్​కి అలర్ట్​..

అయితే, ఒక మ్యూచువల్​ ఫండ్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు కేవలం దాని గత ప్రదర్శన మాత్రమే చూడటం సరికాదు! ఒక పథకం గతంలో మంచి రాబడిని ఇచ్చినంత మాత్రాన, అది భవిష్యత్తులో కూడా మంచి పనితీరును ఇస్తుందని చెప్పలేము. అందువల్ల, పెట్టుబడిదారులు ఫండ్ మేనేజర్ పనితీరు, మ్యూచువల్​ ఫండ్​ సెక్టార్​, ఎకనామిక్​ ఫ్యాక్టర్స్​ వంటి డేటాను తెలుసుకుని ఇన్వెస్ట్​ చేయాల్సి ఉంటుంది.

(గమనిక- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం