తెలుగు రాష్ట్రలతో సహా దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఇష్టమైన ద్విచక్ర వాహనాలు కొన్ని ఉంటాయి. హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్‌ఎల్. ప్రతీ ఊరిలో వీటి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ రెండు వాహనాల అమ్మకాలు జోరుగానే సాగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
టీవీఎస్ ఎక్స్ఎల్ కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ మోపెడ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.61,000 నుండి రూ.80,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. దీన్ని ఆన్-రోడ్‌లో రూ.1 లక్ష కంటే తక్కువ ధరకు పొందవచ్చు. టీవీఎస్ ఎక్స్ఎల్ 99సీసీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ పొందుతుంది. 65 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్ తక్కువ ధరకే దొరుకుతుంది. గ్రామీణ ప్రజలు సులభంగా కొనుగోలు చేస్తారు. ఈ బైక్ వివిధ రూపాల్లో లభిస్తుంది. ధర రూ.79,000 నుంచి రూ.85,000(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. దీని ఆన్ రోడ్ ధర రూ.1.5 లక్షల లోపల ఉంటుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్ 97cc పెట్రోల్ ఇంజిన్‌తో శక్తిని కలిగి ఉంది. 70 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
ఈ వాహనాలతో అడ్వాంటేజ్ ఏంటి అంటే.. ఏదైనా సమస్య ఉంటే స్థానిక గ్యారేజీలలోని మెకానిక్‌లు కూడా దానిని ఈజీగా రిపేర్ చేస్తారు. పట్టుకుని పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సర్వీస్ సెంటర్‌లో రోజులు గడపాల్సిన అవసరం లేదు. ఈ ద్విచక్ర వాహనాల విడిభాగాలు కూడా సులభంగా దొరుకుతాయి.
గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్ఎల్ రోజువారీ పనిలో వివిధ మార్గాల్లో వారికి సహాయపడతాయి. పొలం నుండి ఇళ్లకు వీటిపై చాలా బరువును తీసుకురావొచ్చు. గ్రామాల్లో, సాధారణ రోడ్ల కంటే మట్టి రోడ్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా ఈ ద్విచక్ర వాహనాలపై ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇక మైలేజీ విషయంలోనూ ఇవి గ్రామీణ ప్రజలకు కలిసి వస్తాయి.