టాటా కంపెనీ కార్లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చిన ఈ రెండు ఎస్‌యూవీలు అమ్మకాల్లో టాప్-these two suvs with 5 star safety rating are top sellers from tata company ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటా కంపెనీ కార్లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చిన ఈ రెండు ఎస్‌యూవీలు అమ్మకాల్లో టాప్

టాటా కంపెనీ కార్లలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చిన ఈ రెండు ఎస్‌యూవీలు అమ్మకాల్లో టాప్

Anand Sai HT Telugu
Nov 12, 2024 03:00 PM IST

Tata Motors Sales : టాటా మోటార్స్ అమ్మకాల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2024 అమ్మకాలలో పంచ్, నెక్సాన్ టాప్ స్థానాన్ని పొందాయి. ఈ కంపెనీ అమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం..

అక్టోబర్‌లో టాటా కంపెనీ కార్ల అమ్మకాలు
అక్టోబర్‌లో టాటా కంపెనీ కార్ల అమ్మకాలు (Tata Sales Breakup Oct 2024)

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ అక్టోబర్ 2024 అమ్మకాల పంచుకుంది. నివేదిక ప్రకారం అక్టోబర్ 2024 నెలలో టాటా మోటార్స్ 48,133 యూనిట్ల అమ్మకాలతో స్వల్ప వృద్ధిని సాధించింది. కంపెనీ రెండు ఫ్లాగ్‌షిప్ మోడళ్లు పంచ్, నెక్సాన్ అమ్మకాల పరంగా టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాయి. ఇతర మోడళ్ల అమ్మకాల వివరాలను తెలుసుకుందాం.

అక్టోబర్ 2024లో టాటా మోటార్స్ నాల్గో బెస్ట్ సెల్లింగ్ కార్ల తయారీదారుగా నిలిచింది. టాటా కంటే మారుతి, హ్యుందాయ్, మహీంద్రా ముందున్నాయి. ఆల్ట్రోజ్ మినహా కంపెనీకి చెందిన అన్ని మోడళ్లు నెలవారీ అమ్మకాలలో పెరుగుదలను చూశాయి. అయితే నాలుగు మోడళ్ల అమ్మకాలు సంవత్సర ప్రాతిపదికన తగ్గాయి. టాటా మోటార్స్ పోర్ట్ ఫోలియోలో 8 కార్లు, ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో 5 ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.

పంచ్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ పంచ్/పంచ్ ఈవీ. అక్టోబర్ 2023లో విక్రయించిన 15,317 యూనిట్లతో పోలిస్తే 2024 అక్టోబర్‌లో దాని అమ్మకాలు 3 శాతం పెరిగి 15,740 యూనిట్లుగా ఉన్నాయి. 2024 సెప్టెంబర్లో విక్రయించిన 13,711 యూనిట్లతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 15 శాతం పెరిగాయి.

టాటా నెక్సాన్ గత నెలలో 14,759 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో ఉంది. అక్టోబర్ 2023లో విక్రయించిన 16,887 యూనిట్లతో పోలిస్తే నెక్సాన్ 13 శాతం క్షీణతను ఎదుర్కొంది. అయితే 2024 సెప్టెంబర్‌లో విక్రయించిన 11,470 యూనిట్లతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 29 శాతం పెరుగుదలతో ఈ లోటును భర్తీ చేయవచ్చు.

కొత్త టాటా కర్వ్ భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయిన గత 2 నెలల్లో మంచి డిమాండ్ ను చూసింది. 2024 సెప్టెంబర్లో 4,763 యూనిట్లను విక్రయించగా, గత నెలలో 5,351 యూనిట్లను విక్రయించింది. ఈ కూపే ఎస్‌యూవీకి 5-స్టార్ రేటింగ్ లభించింది.

టాటా టియాగో, ఆల్ట్రోజ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. టియాగో అమ్మకాలు 2023 అక్టోబర్లో విక్రయించిన 5,356 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 13 శాతం క్షీణించి 4,982 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2024 సెప్టెంబర్లో విక్రయించిన 4,225 యూనిట్లతో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. దీని తరువాత ఆల్ట్రోజ్ 2,642 యూనిట్లను విక్రయించింది.

టాటా మోటార్స్ మిడ్-సైజ్ ఎస్‌యూవీలు సఫారీ, హారియర్ అక్టోబర్ 2024లో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. ఈ రెండు మోడళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. టాటా సఫారీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 56 శాతం, నెలవారీగా 27 శాతం పెరిగాయి. 2023 అక్టోబర్‌లో 1,340 యూనిట్లు, 2024 సెప్టెంబర్లో 1,644 యూనిట్లను విక్రయించగా, 2024 అక్టోబర్లో 2,086 యూనిట్లను విక్రయించింది.

టాటా హారియర్ అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. 2023 అక్టోబర్‌లో 1,896 యూనిట్లు అమ్ముడుపోగా.. 2024 అక్టోబర్లో 1,947 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 సెప్టెంబర్లో 1,600 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే అమ్మకాలు 22 శాతం పెరిగాయి.

మరోవైపు టాటా టిగోర్ అమ్మకాలు 41 శాతం క్షీణించాయి. 2023 అక్టోబర్లో 1,563 యూనిట్లు అమ్ముడుపోగా, 2024 అక్టోబర్లో 926 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే నెలవారీ అమ్మకాలు మాత్రం 4 శాతం పెరిగాయి.

Whats_app_banner