Tax-saving mutual funds: గత మూడేళ్లలో ఆల్ఫా రిటర్న్స్ ఇచ్చిన 12 మ్యుచ్యువల్ ఫండ్స్ ఇవే.. అదనంగా టాక్స్ బెనిఫిట్స్ కూడా..-these twelve tax saving equity mutual funds gave alpha returns in three years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tax-saving Mutual Funds: గత మూడేళ్లలో ఆల్ఫా రిటర్న్స్ ఇచ్చిన 12 మ్యుచ్యువల్ ఫండ్స్ ఇవే.. అదనంగా టాక్స్ బెనిఫిట్స్ కూడా..

Tax-saving mutual funds: గత మూడేళ్లలో ఆల్ఫా రిటర్న్స్ ఇచ్చిన 12 మ్యుచ్యువల్ ఫండ్స్ ఇవే.. అదనంగా టాక్స్ బెనిఫిట్స్ కూడా..

HT Telugu Desk HT Telugu
Oct 06, 2023 02:17 PM IST

Tax-saving mutual funds: ఈఎల్ఎస్ఎస్ ల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల డబుల్ బెనిఫిట్ ఉంటుంది. దాదాపు గ్యారెంటీ రిటర్న్స్ తో పాటు ఆదాయ పన్నులో సెక్షన్ 80 సీ ప్రకారం మినహాయింపు కూడా ఉంటుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

Tax-saving mutual funds: మ్యుచ్యువల్ ఫండ్స్ లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) లో పెట్టుబడులు పెట్టడం కొంతవరకు సురక్షితం. అంతేకాదు, ఈ ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడులపై వచ్చే రాబడిలో రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, ఈ పెట్టుబడులను కనీసం 3 ఏళ్ల లాక్ ఇన్ పీరియడ్ లో ఉంచాలి.

ఇలా చేయండి..

అయితే ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) లో పెట్టుబడులు పెట్టే సమయంలో జాగ్రత్తగా మార్కెట్ ను పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దని, మీరు పెట్టుబడి పెట్టే సమయంలో మార్కెట్ పరిస్థితులు మీ రిటర్న్స్ పై తీవ్రమైన ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు.

ఈ 12 ఫండ్స్ తో ఆల్ఫా రిటర్న్స్

ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఇటీవల ఒక నివేదిక వెలువరించింది. అందులో గత మూడేళ్లలో ఆల్ఫా రిటర్న్స్ ఇచ్చిన 12 మ్యుచ్యువల్ ఫండ్స్ స్కీమ్స్ ను వివరించింది. ఆల్ఫా రిటర్న్స్ అంటే మార్కెట్ ఫలితాలను మించి లాభాలను ఆర్జించడం. ఆ 12 మ్యుచ్యువల్ ఫండ్స్ స్కీమ్స్ ఇవే..

  1. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ - వృద్ధి- 27.80%

2) మోతీలాల్ ఓస్వాల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ - వృద్ధి- 26.40%

3) బ్యాంక్ ఆఫ్ ఇండియా టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ - గ్రోత్- 26.10%

4) HDFC టాక్స్ సేవర్ - వృద్ధి- 28.20%

5) బంధన్ ట్యాక్స్ అడ్వాంటేజ్ (ELSS) ఫండ్ - గ్రోత్ -30.60%

6) ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్‌షీల్డ్ - వృద్ధి- 28.70%

7) పరాగ్ పారిఖ్ ట్యాక్స్ సేవర్ ఫండ్ - గ్రోత్- 23%

8) DSP టాక్స్ సేవర్ ఫండ్ - వృద్ధి- 26.40%

9) నిప్పాన్ ఇండియా ట్యాక్స్ సేవర్ (ELSS) ఫండ్ - గ్రోత్- 27.90%

10) కోటక్ టాక్స్ సేవర్ ఫండ్ - గ్రోత్- 24.70%

11) మహీంద్రా మాన్యులైఫ్ ELSS ఫండ్ - గ్రోత్- 26.40%

12) మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ - గ్రోత్- 23.80%

(గమనిక​:- ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel