Stock Market : ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చిన 4 టాప్ కంపెనీలు.. రూ.1.25 లక్షల కోట్లు నష్టం.. రిలయన్స్‌కు పెద్ద దెబ్బ!
Stock Market News : దేశంలోని అత్యంత విలువైన 10 కంపెనీల్లో నాలుగు కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ చూసుకుంటే గత వారం రూ.1,25,397.45 కోట్లు క్షీణించింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఎక్కువ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.
గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగు కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాప్ మెుత్తం కలిపి రూ.1,25,397.45 కోట్లు క్షీణించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పెద్ద దెబ్బ తగిలింది. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 428.87 పాయింట్లు(0.55 శాతం) పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు(0.47) శాతం పడిపోయింది.
4 కంపెనీలతో షాక్
మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.74,969.35 కోట్లు క్షీణించి రూ.16,85,998.34 కోట్లకు పడిపోయింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) విలువ రూ.21,251.99 కోట్లు క్షీణించి రూ.5,19,472.06 కోట్లకు పరిమితమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలువ రూ.17,626.13 కోట్లు తగ్గి రూ.6,64,304.09 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ విలువ రూ.11,549.98 కోట్లు తగ్గి రూ.8,53,945.19 కోట్లకు పడిపోయింది.
వీటిలో పెరుగుదల
మరోవైపు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.24,934.38 కోట్లు పెరిగి రూ.7,78,612.76 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ రూ.9,828.08 కోట్లు పెరిగి రూ.12,61,627.89 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్ విలువ రూ.9,398.89 కోట్లు పెరిగి రూ.9,36,413.86 కోట్లకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విలువ రూ.9,262.3 కోట్లు పెరిగి రూ.15,01,976.67 కోట్లకు చేరుకుంది.
వీటితో పాటు హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. టాప్ 10 కంపెనీల్లో ఆర్ఐఎల్ మొదటి స్థానంలో నిలవగా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, హెచ్యూఎల్, ఐటీసీ, ఎల్ఐసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
బడ్జెట్ ప్రభావం!
ఈ వారం త్రైమాసిక ఫలితాలు, యూఎస్ ఫెడ్ రిజర్వ్ రేట్లతో ప్రభావం చూపనుంది. దీంతో పాటు స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ఎఫెక్ట్ కూడా ఉండనుంది. ఫిబ్రవరి 1 బడ్జెట్ రోజున ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రకటన చేస్తే అది కచ్చితంగా స్టాక్ మార్కెట్‌కు ఊపు తెచ్చే అవకాశం ఉంది.