Lok Sabha results Stocks to buy : జూన్ 4న వెలువడే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే 370కి పైగా సీట్లు గెలుచుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజారిటీని సూచించడంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుతో ప్రయోజనం పొందగల స్టాక్స్‌ను బ్రోకరేజీ సంస్థలు గుర్తించాయి. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్‌గా ఉంటే ఈ ‘మోదీ స్టాక్స్’ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల నుంచి నేరుగా లబ్ది పొందిన కంపెనీలు లేదా రంగాల షేర్లు ఇవి.
గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ.. ప్రధాని మోదీ విధానాలకు ప్రత్యక్ష లబ్ధిదారులుగా ఉండగల 54 కంపెనీలను గుర్తించింది. అవి:
రక్షణ, తయారీ: హెచ్ఏఎల్, హిందుస్థాన్ కాపర్, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్, కమిన్స్ ఇండియా, సీమెన్స్, ఏబీబీ ఇండియా, సెయిల్, భెల్, భారత్ ఫోర్జ్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్: ఇండస్ టవర్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, ఐఆర్సీటీసీ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
Lok Sabha election results 2024 : పవర్ అండ్ ఎనర్జీ: ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ పీఎఫ్సీ, ఆర్ఈసీ, టాటా పవర్, హెచ్ పీసీఎల్, గెయిల్, జేఎస్ పీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్ జీసీ, కోల్ ఇండియా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బీపీసీఎల్, ఐఓసీఎల్.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్: ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా.
టెలికాం: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇండస్ టవర్స్.
అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, ఇండియన్ హోటల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, ఇండియా సిమెంట్స్, దాల్మియా భారత్, రామ్కో సిమెంట్స్ ఈ లిస్ట్‌లో మరిన్ని స్టాక్స్.
Stocks to buy on election results : ఎన్టీపీసీ, టక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ (టెక్స్రైల్), ఎస్బీఐ, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతీ ఎయిర్టెల్ వంటి పలు స్టాక్స్‌ని యెస్ సెక్యూరిటీస్ జూన్ 4న కొనుగోలు చేయాలని సూచించింది.
బ్రోకరేజీ సంస్థ ఫిలిప్ క్యాపిటల్ కూడా ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చగల 21 స్టాక్స్‌ని విడుదల చేసింది. వీటిలో ఎస్బిఐ, బీఓబీ, కెనరా బ్యాంక్, పీఎఫ్సీ, ఆర్ఇసి, శ్రీరామ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, సిమెన్స్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, దివీస్ ల్యాబ్స్, సింజీన్, ఎపిఎల్ అపోలో, జిందాల్ ఎస్ఏవి, ఐజీఎల్, ఆర్తి ఇండస్ట్రీస్, వినతి ఆర్గానిక్స్ ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్లో భారీ పాజిటివిటీ నెలకొంది. అందుకే సోమవారం ట్రేడింగ్ సెషన్లో 2,507 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ 76,469 వద్ద స్థిరపడింది. ఇక 733 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 23,264 వద్ద ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. మంగళవారం కూడా స్టాక్ మార్కెట్లలో మంచి లాభాలను చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్