అమెజాన్ ప్రైమ్‌ను ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే వీఐ యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్-these recharge plans are the best option for vodafone idea users who want to enjoy amazon prime subscription for free ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అమెజాన్ ప్రైమ్‌ను ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే వీఐ యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్

అమెజాన్ ప్రైమ్‌ను ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకుంటే వీఐ యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్

Anand Sai HT Telugu

మీరు ప్రీపెయిడ్ యూజర్ అయితే ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెరుగైన డేటా, కాలింగ్ బెనిఫిట్స్ కావాలనుకుంటే వొడాఫోన్ ఐడియా రెండు ప్లాన్లను అందిస్తోంది. వాటిలో అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(వీఐ) తన వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లతో కంపెనీ ఇప్పుడు ఉచిత అమెజాన్ ప్రైమ్‌ లైట్ సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. మీరు ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడి, మొబైల్ రీఛార్జ్‌తో అదనపు ప్రయోజనాలు కోరుకుంటే ఈ ప్లాన్లు మీకు బెటర్. రూ.996, రూ.3799 రీఛార్జ్ చేసుకుంటే వీఐ నుంచి ఉచిత ఓటీటీ బెనిఫిట్ లభిస్తుంది.

రూ .996 ప్లాన్ వివరాలు

వొడాఫోన్ ఐడియా రూ .996 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా 90 రోజుల పాటు అందిస్తోంది.

ప్లాన్‌లో అన్‌మిటెడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో బింజ్ ఆల్ నైట్‌తో అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా, వీకెండ్ డేటా రోల్ఓవర్, వారాంతంలో వారంలో మిగిలిన డేటాను ఉపయోగించే ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే డేటా డిలైట్స్‌తో అదనపు డేటా కూడా లభిస్తుంది. మరోవైపు మీరు వీఐ 5జీ సేవ అందుబాటులో ఉన్న నగరాల్లో నివసిస్తుంటే, మీకు 5జీ సపోర్ట్ ఉన్న ఫోన్ ఉంటే.. మీరు ఈ ప్లాన్‌తో 5జీ స్పీడ్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.

రూ.3799 ప్లాన్ వివరాలు

వొడాఫోన్ ఐడియా రూ.3799 ప్రీపెయిడ్ ప్లాన్ వార్షిక ప్లాన్. ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ నుండి విముక్తి పొందాలనుకునే వినియోగదారులకు ఉత్తమమైనది. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు 365 రోజుల సర్వీస్ వ్యాలిడిటీతో లభిస్తాయి. ఈ ప్లాన్లో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ను ఏడాది పాటు (365 రోజులు) ఉచితంగా అందిస్తోంది.

ఇది మునుపటి ప్లాన్ల మాదిరిగానే అన్లిమిటెడ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వీటిలో బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్స్ ఉన్నాయి. ఈ రెండు ప్లాన్లలో రోజువారీ డేటా పరిమితిని చేరుకున్నప్పుడు, వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అదే సమయంలో మీరు 5జీ కవరేజ్ ప్రాంతంలో ఉంటే గొప్ప హై-స్పీడ్ ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.