MIUI 14 for Poco Phones: ఈ 10 పోకో మొబైళ్లకు ఎంఐయూఐ 14 అప్‍డేట్.. ఎప్పుడొస్తుందంటే!
MIUI 14 Update for Poco Phones: ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను అందుకునే పోకో మొబైళ్ల లిస్టును ఆ కంపెనీ వెల్లడించింది. ఎప్పుడు ఏ ఫోన్‍కు అప్‍డేట్ రోల్అవుట్ చేయనున్నది టైమ్‍లైన్ పేర్కొంది.
MIUI 14 Update for Poco Phones: షావోమీ 13 ప్రో 5జీ (Xiaomi 13 Pro 5G) మొబైల్‍తో పాటు గత నెల లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఎంఐయూఐ 14’ ( MIUI 14)ను ఇండియాలో లాంచ్ చేసింది షావోమీ. కొత్త ఫీచర్లు, యూఐలో మార్పులతో ఎంఐయూఐ 14ను తీసుకొచ్చింది. షావోమీ, రెడ్‍మీ ఫోన్‍లకు ఈ ఎంఐయూఐ 14 అప్‍డేట్ ఎప్పుడొస్తుందో ఇటీవలే షావోమీ టైమ్‍లైన్‍ను వెల్లడించింది. తాజాగా పోకో ఫోన్‍లకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. పోకో మోడళ్లకు ఎంఐయూఐ 14 అప్‍డేట్ ఎప్పుడొస్తుందో టైమ్‍లైన్‍ను పోకో వెల్లడించింది. ఆ వివరాలు ఇవే.
ముందుగా 10 పోకో స్మార్ట్ ఫోన్‍లకు ఎంఐయూఐ అప్‍డేట్‍లను పోకో ఇవ్వనుంది. క్వార్టర్స్ వారీగా టైమ్‍లైన్ ఎలా ఉందంటే..
2023 తొలి క్వార్టర్‌లో..
MIUI 14 Update for Poco Phones: ఇటీవల లాంచ్ చేసిన పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ ఈ ఏడాది తొలి క్వార్టర్ అంటే తొలి మూడు నెలల్లో ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను అందుకుంటుంది.
2023 రెండో క్వార్టర్‌లో..
MIUI 14 Update for Poco Phones: పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్4 5జీ, పోకో ఎఫ్3 జీటీ, పోకో సీ55, పోకో ఎం5, పోకో ఎం4 5జీ మొబైళ్లు రెండో క్వార్టర్‌లో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను పొందుతాయి.
2023 మూడో క్వార్టర్‌లో..
MIUI 14 Update for Poco Phones: ఇక ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పోకో ఎక్స్4 ప్రో 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ, పోకో ఎం4 5జీ ఫోన్లకు ఎంఐయూఐ 14 అప్‍డేట్ రోల్అవుట్ అవుతుంది.
ఎంఐయూఐ 14 ఫీచర్లు
MIUI 14 Features: ఎంఐయూఐ 13తో పోలిస్తే ఎంఐయూఐ 14 లైట్‍వెయిట్ యూఐ స్కిన్‍తో ఉంటుంది. దీని ద్వారా ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో మొబైల్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. ర్యామ్, స్టోరేజ్ ఆప్టిమైజేషన్ పెరుగుతుంది. స్పేస్ సేవ్ అవుతుంది.
యూఐలో డిజైన్ పరంగానూ ఎంఐయూఐ 14లో మార్పులు ఉంటాయి. హోమ్ స్క్రీన్‍ను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. సరికొత్త విడ్జెట్లు, వాల్‍పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా లార్జ్ ఐకాన్స్ ఉపయోగపడతాయి. దీంతోపాటు ఐకాన్స్ ఫోల్డర్ సైజ్‍లను కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక కొత్త సెక్యూరిటీ ఫీచర్లు, కెెమెరా ఫీచర్లు కూడా ఎంఐయూఐ 14 ద్వారా మొబైళ్లకు యాడ్ అవుతాయి.
షావోమీ, రెడ్‍మీ ఫోన్లు ఈ ఏడాది ఎప్పుడు ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను అందుకుంటాయో ఇటీవలే టైమ్‍లైన్‍ను షావోమీ ప్రకటించింది. మోడల్‍ను బట్టి ఆయా సమయాల్లో ఆ ఫోన్‍లకు కొత్త వెర్షన్ రోల్అవుట్ చేస్తుంది.
సంబంధిత కథనం