మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ లో రిస్క్- హై రిటర్న్ ఫండ్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే! ఈ లార్జ్ క్యాప్ మ్యూచవల్ ఫండ్స్‌లో 5ఏళ్లల్లో 20శాతం కన్నా ఎక్కువ సీఏజీఆర్ రిటర్నులు లభించడం విశేషం.
మ్యూచువల్ ఫండ్స్ సెబీ వర్గీకరణ ప్రకారం తమ ఆస్తుల్లో 80 శాతాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే పథకాలను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. వీటిల్లో ఒడుగొడుకులు తక్కువగా ఉంటాయి.
ఏప్రిల్ 30, 2025 నాటికి యాంఫీ డేటా ప్రకారం మొత్తం 33 లార్జ్ క్యాప్ పథకాలు రూ .3.74 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో రూ.2,671 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
కాగా గత ఐదేళ్లలో 20 శాతానికి పైగా వార్షిక రాబడిని అందించిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ | 5ఏళ్ల రిటర్నులు (%) |
---|---|
ABSL Frontline Equity fund | 23.20 |
Bandhan Large Cap Fund | 21.44 |
Baroda BNP Paribas Large Cap | 21.44 |
Canara Robeco Bluechip Equity Fund | 21.39 |
DSP Large Cap | 22.57 |
Edelweiss Large Cap Fund | 22.13 |
Franklin India Bluechip Fund | 22.20 |
HDFC Large Cap fund | 24.87 |
ICICI Pru Bluechip Fund | 25.34 |
Invesco India Large Cap Fund | 21.91 |
Kotak Bluechip Fund | 22.72 |
Mahindra Manulife Large Cap Fund | 21.32 |
Nippon India Large Cap Fund | 27.79 |
SBI Blue Chip Fund | 22.61 |
Tata Large Cap Fund | 22.56 |
నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ గత ఐదేళ్లలో 27.79 శాతానికి పైగా వార్షిక రాబడిని అందించగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ 25.34 శాతం రిటర్నులు ఇచ్చింది. అంటే ఐదేళ్ల క్రితం ఎవరైనా నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే పెట్టుబడి రూ.3.40 లక్షలకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.3.09 లక్షలకు పెరిగేది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్కి ముందు గత రాబడులను చూడటం సాధారణం. ఇది భవిష్యత్తు రిటర్నులపై అంచనాలను ఇస్తుంది. అయితే, కేవలం ఫండ్ హిస్టరీని చూసి ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఒక పథకం గతంలో అధిక రాబడిని అందించినంత మాత్రాన, భవిష్యత్తులో కూడా అదే వేగంతో వృద్ధి చెందుతుందని చెప్పలేము.
సంబంధిత కథనం