సొంత ఇల్లు అనేది అందరి కల. ఈ సమయంలో మీరు కూడా సొంత ఇంటి కోసం ప్లాన్ చేస్తుంటే మీ కోసం గుడ్‌న్యూస్ ఉంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తూనే ఉండటంతో బ్యాంకులు కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేటుతో మీ సొంత ఇంటిని కలను నిజం చేసుకోవడానికి ఇది మంచి టైమ్. తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. అయితే మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి.
గృహ రుణాలు పెద్ద మొత్తాలుగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక రుణాలు. వడ్డీ రేట్లలో చిన్న వ్యత్యాసం కూడా మీ ఆర్థిక ప్రణాళికపై ప్రభావాన్ని చూపుతుంది. గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందు వివిధ బ్యాంకుల వద్ద వడ్డీ రేట్లను చెక్ చేయాలి. వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వార్షిక వడ్డీ రేటు 8 నుండి 9.15 శాతం వరకు ఉంటుంది.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో 8.75 శాతం నుండి ప్రారంభమవుతుంది.
ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 8.70 శాతం నుండి ప్రారంభమవుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8 నుండి 9.85 శాతం వరకు అందిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్ గృహ రుణాలపై 8.75 శాతం - 12.80 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.85 శాతం - 10.65 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 8.25 శాతం నుండి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
యూనియన్ బ్యాంక్ గృహ రుణాలపై 7.85 శాతం - 10.40 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
ఆర్బీఐ రెపో రేటుతో బ్యాంకుల నిధుల ఖర్చును తగ్గిస్తుంది. ఈ కారణంగా బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. గృహ రుణాలు సాధారణంగా రెపో రేటుతో ముడిపడి ఉంటాయి. రెపో రేటు తగ్గితే మీ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. సొంత ఇల్లు కావాలని కలలు కనే వారికి మంచి సమయం. వడ్డీ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, వృత్తి, వయస్సు, రుణ మొత్తాన్ని బట్టి మారవచ్చు. బ్యాంకులు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి.