ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు.. కనీసం 8.15 శాతం నుంచి-these banks offer cheapest electric vehicles loans and non electric car loan know interest rates here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు.. కనీసం 8.15 శాతం నుంచి

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు.. కనీసం 8.15 శాతం నుంచి

Anand Sai HT Telugu

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. బ్యాంకులు కూడా ఈవీలు కొనేందుకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల లోన్స్

ేశంలో ఈవీల వాడకం పెరుగుతోంది. వివిధ కార్ల తయారీదారులు కూడా ఆఫర్లను అందిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, పన్ను మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అంశాలతో ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకులు ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ వాహనాలకు తక్కువ వడ్డీ రుణాలను అందిస్తున్నాయి. విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి బ్యాంకులు ప్రత్యేక రుణ సౌకర్యాలను కూడా అందిస్తున్నాయి. చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు ఈవీ వాహనాలకు రుణాలు అందిస్తున్నాయి.

ఈవీ కొనుగోలుదారులు ప్రభుత్వ సబ్సిడీలు, రోడ్డు పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి మినహాయింపు పొందుతారు. ఈవీ కార్ లోన్ అనేది ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఇచ్చే రుణం. ఇది సాధారణ కార్ లోన్‌ల మాదిరిగానే ఉంటుంది. రుణదాత మీకు వాహనం కొనడానికి డబ్బు ఇస్తాడు. ఆ డబ్బును నెలవారీ వాయిదాలలో ఒక నిర్దిష్ట వ్యవధిలో తిరిగి చెల్లిస్తారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏ బ్యాంకులు ఎంత వడ్డీతో రుణాలు అందిస్తున్నాయో చూద్దాం.. ఇందులో వడ్డీ రేటు కనీసం 8.15 శాతం నుంచి మెుదలవుతుంది.

  • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎలక్ట్రిక్ వాహనాలపై వడ్డీ రేట్లను 8.15 శాతం నుండి ప్రారంభిస్తుంది. అదే నాన్-ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది 8.35 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
  • యూనియన్ బ్యాంక్ ఎలక్ట్రిక్ వాహనాలకు 8.20 శాతం, నాన్-ఎలక్ట్రిక్ వాహనాలకు 8.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎలక్ట్రిక్ వాహనాలకు 8.35 శాతం, ఇతర వాహనాలకు 8.40 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
  • సెంట్రల్ బ్యాంక్ 8.35 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది.
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎలక్ట్రిక్ వాహనాలకు 8.40 శాతం, నాన్-ఎలక్ట్రిక్ వాహనాలకు 8.50 శాతం వసూలు చేస్తుంది.
  • కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు వరుసగా 8.55 శాతం, 8.65 శాతం ఉన్నాయి.
  • ఇండియన్ బ్యాంక్ ఎలక్ట్రిక్ వాహనాలకు 8.70 శాతం, ఇతర వాహనాలకు 8.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు 9.10 శాతం, ఇతర వాహనాలకు 9.20 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎలక్ట్రిక్ వాహనాలకు 9.20 శాతం, నాన్-ఎలక్ట్రిక్ వాహనాలకు 9.27 శాతం ​​వడ్డీ రేటును కలిగి ఉంది.
  • కర్ణాటక బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలకు 9.32 శాతం, నాన్ ఎలక్ట్రిక్ వాహనాలకు 9.42 శాతం వసూలు చేస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.