మీరు మీ పొదుపును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది! మీ పొదుపును పెట్టుబడి పెట్టడానికి, మంచి రాబడిని పొందడానికి ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) ఇప్పటికీ ఉత్తమమైన ఆప్షన్స్‌లో ఒకటి. ప్రస్తుతం, దేశంలోని పెద్ద ప్రైవేట్ రంగ రుణదాతలు ల్యాండర్ల నుంచి ప్రభుత్వ బ్యాంకులు ఎఫ్డీలపై తమ వినియోగదారులకు గొప్ప రాబడిని ఇస్తున్నారు. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు 1 సంవత్సరం ఎఫ్డీలపై 7.75 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. 1 సంవత్సరం ఎఫ్డీలపై అత్యధిక రాబడిని ఇచ్చే 10 బ్యాంకుల గురించి తెలుసుకుందాము..
కెనరా బ్యాంక్- తన సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్డీపై 7.25 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది కెనరా బ్యాంక్.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్- ఈ బ్యాంకు తన సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్డీపై 7.25 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో ఈ బ్యాంకు తన సాధారణ కస్టమర్లకు ఒక సంవత్సరం ఎఫ్డీలపై 7 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.40 శాతం వడ్డీని అందిస్తోంది.
డ్యూయిష్ బ్యాంక్- తన సాధారణ కస్టమర్లకు 1 సంవత్సరం ఎఫ్డీపై 7% వడ్డీని అందిస్తోంది.
ఆర్బీఎల్ బ్యాంక్- ఈ బ్యాంకు ఏడాది ఎఫ్డీపై 7 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.50 శాతం వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా- తన సాధారణ కస్టమర్లకు 7 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.50 శాతం వడ్డీని అందిస్తోంది ఈ బ్యాంకు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)- దేశంలోనే అతి పెద్ద బ్యాంకు.. తన సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్డీపై 6.80 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.30 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా- 1 సంవత్సరం ఎఫ్డీపై 6.75 శాతం, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఈ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 6.75 శాతం వరకు, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 7.25 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.
మరిన్ని వివరాల కోసం మీరు సంబంధిత బ్యాంకు వెబ్సైట్ లేదా బ్యాంకు బ్రాంచీని సంప్రదించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం