Richest zodiac signs: హురున్ 2024 రిచ్ లిస్ట్ ప్రకారం.. భారతదేశంలో అత్యంత ధనిక రాశులు ఇవే
Richest zodiac signs: కర్కాటకం, మిథున రాశి, సింహరాశి వారు గణనీయమైన సంపద పెరుగుదలతో హురున్ ఇండియా 2024 రిచ్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నారు. కర్కాటక రాశి వారి సంపద 84 శాతం పెరుగుతుంది.
Richest zodiac signs: హురున్ ఇండియా సంస్థ 2024 సంవత్సరానికి గానూ భారత్ లో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ నిలిచారు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీని రెండో స్థానానికి తగ్గారు. ఈ జాబితాలో తొలిసారి బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ స్థానం సంపాదించారు. ఈ హురున్ రిచ్ లిస్ట్ లో ఉన్నవారి జన్మరాశులను పరిశీలిస్తే, కర్కాటక రాశి వారి సంపద గణనీయంగా పెరిగినట్లు తెలుస్తుంది.
కర్కాటకం, మిధునం తొలి రెండు స్థానాల్లో..
తాజా హురున్ ఇండియా 2024 రిచ్ లిస్ట్ ప్రకారం కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు 2024 లో అత్యుత్తమ సంవత్సరాన్ని కలిగి ఉన్నారు, తరువాత స్థానాల్లో మిథున రాశి, సింహ రాశి, ధనస్సు రాశి, తులా రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వారి సంపద 84 శాతం పెరిగింది. మిథున రాశి వారి సంపద 77 శాతం పెరగగా, 68 శాతం వృద్ధితో సింహ రాశి మూడో స్థానంలో ఉంది. ధనస్సు రాశి వారి సంపద 64 శాతం పెరిగింది. తులారాశి వారి సంపద 61 శాతం వృద్ధి చెందాయి. మకర రాశి వారి సంపద 58 శాతం, మీనం రాశి వారి సంపద 46 శాతం పెరిగాయి.
చివరలో వృషభ రాశి
కుంభరాశి, కన్యా రాశి వారి సంపదలో 39 శాతం పెరుగుదల సంభవించింది. వీరు సంయుక్తంగా ఎనిమిదో స్థానాన్ని పంచుకున్నారు. మేషం, వృశ్చిక రాశి, వృషభరాశి వారు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద పెరుగుదలతో చివరి స్థానాలను ఆక్రమించారు. సంపద పెరుగుదలలో కర్కాటకం అగ్రస్థానంలో ఉంది. అయితే, హురున్ 2024 సంపన్నుల జాబితాలో ఉన్నవారిలో 9.9 శాతం మంది మిధున రాశి వారు ఉన్నారు. మొత్తం లిస్ట్ లో మిధున రాశి వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో కుమార మంగళం బిర్లా, ఎల్ ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు. సునీల్ మిట్టల్, ముకేశ్ అంబానీ (Mukesh Ambani) లు మంచి వృద్ధి రేటును చూపించడంతో వృచ్ఛికం, మేష రాశి వారు ఈ జాబితాలో బలమైన ఉనికిని చూపించారు.