Investment : ఒక సంవత్సరంలోనే మంచి రాబడి వచ్చేందుకు ఈ పెట్టుబడి ఆప్షన్స్ చూడండి
Investment Plans : తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చే పెట్టుబడి స్కీమ్స్ గురించి చాలా మంది చూస్తారు. అలాంటివి కొన్ని ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
2025 కొత్త సంవత్సరం వస్తుంది. ఈ ఏడాదిలో కొత్తగా ఏదైనా పెట్టుబడి ప్లాన్ చేయాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆర్థికంగా మెరుగవ్వాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉంటుంది. చాలా మంది మంచి రాబడిని ఇచ్చే చోట పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. పెట్టుబడిలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టుబడి పెట్టాలి. అయితే కొందరికి తక్కువ వ్యవధిలోనే డబ్బులు కావాల్సి వస్తుంది. అలాంటివారు స్వల్పకాలిక పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వచ్చినంత రాబడులు మాత్రం ఇందులో ఉండవు. మీరు ఏడాది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేస్తే మీ కోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్
ఒక సంవత్సరం మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ చూడాలి. ఇందులో 12 నెలలు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా అది సురక్షితమైన ప్రదేశంలో ఉండాలి. డెట్ ఫండ్‌లకు నిర్ణీత మెచ్యూరిటీ తేదీ ఉంటుంది. ఇందులో కూడా మంచి ఆదాయం పొందవచ్చు.
సిప్ ట్రై చేయండి
మార్కెట్‌లో ఎక్కువ రాబడులు రావాలని మీరు అనుకుంటే.. సిప్‌ని ప్రారంభించవచ్చు. ఇందులో కూడా మీ బడ్జెట్ ప్రకారం ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ సిప్‌ని మూసివేయడం ద్వారా కావలసినప్పుడు మీ డబ్బును ఉపయోగించవచ్చు. సిప్‌లో వివిధ పథకాల నుండి మంచి రాబడిని పొందవచ్చు. సాధారణంగా సిప్‌ల రాబడిని 12 శాతంగా పరిగణిస్తారు. ఇందులో రిస్క్ ఉంటుంది.
రికరింగ్ డిపాజిట్
రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అనేది రెగ్యులర్ డిపాజిట్లు చేయడానికి, పెట్టుబడిపై రాబడిని సంపాదించడానికి ఉపయోగపడుతుంది. మీరు నెలవారీ చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ ఆర్డీ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఇక్కడ మీరు ప్లాన్ రద్దు చేసిన తర్వాత వడ్డీతో సహా మొత్తం అందుకుంటారు. ఆర్డీలో కూడా మీరు మీ అవసరానికి అనుగుణంగా 1 సంవత్సరం నుండి వివిధ సంవత్సరాల వరకు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. అన్ని బ్యాంకుల్లో ఆర్డీ సౌకర్యం ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో ఆర్‌డీపై అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను చూసుకోండి. మీకు ఎక్కువ వడ్డీ వచ్చే చోట డబ్బును పెట్టుబడి పెట్టాలి.
ఫిక్స్‌డ్ డిపాజిట్
మీ డబ్బును మొత్తంగా డిపాజిట్ చేయాలనుకుంటే ఎఫ్‌డీ అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం అనేక పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్ కూడా ఎక్కువమంది ఫాలో అవుతారు.