Recharge Plans : ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఎక్కువ డేటా వాడే వారికి బెస్ట్.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీ
Recharge Plans : టెలికాం కంపెనీల ఛార్జీల పెంపు తర్వాత కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్స్ పెడుతున్నాయి. ఎక్కువ డేటా వాడే వారికి, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా కావాలి అనుకునేవారికి ఎయిర్‌టెల్ కూడా వివిధ ప్లాన్స్ అందిస్తోంది.
భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు అనేక ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లలో రోజువారీ డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, కొన్ని అదనపు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. భారతి ఎయిర్‌టెల్ రోజువారీ 1 జీబీ డేటా అలవెన్స్, 2 జీబీ డేటా అలవెన్స్, 3 జీబీ డేటా అలవెన్స్‌లతో కూడిన ప్లాన్స్ ఇస్తోంది. వాటి గురించి చూద్దాం..
ఎయిర్‌టెల్‌కు చెందిన రూ.3599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 2 GB డేటా ప్రయోజనం పొందుతారు. మొత్తం వ్యవధికి 730 GB డేటా ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యం, రోజువారీ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ఎయిర్‌టెల్ ఉచిత హలో ట్యూన్, కొన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ వస్తాయి.
రూ.1199 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 2.5 జీబీ డేటా ప్రయోజనం పొందుతారు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యం, రోజువారీ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఎయిర్‌టెల్ ఫ్రీ హలో ట్యూన్, ఇతర యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 365 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం 24 జీబీ డేటా ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యం, రోజువారీ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ఎయిర్‌టెల్ ఉచిత హలో ట్యూన్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి.
రూ.929 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 90 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 1.5 జీబీ డేటా ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్ సౌకర్యం, రోజువారీ 100 ఎస్ఎంస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు ఎయిర్‌టెల్ ఉచిత హలో ట్యూన్, ఓటీటీ యాప్స్ కూడా వస్తాయి.