Stocks to buy: స్వల్పకాలంలో అధిక రాబడినిచ్చే ఈ 9 స్టాక్స్ లో పెట్టుబడి పెట్టండి..
Stocks to buy: స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి స్వల్పకాలంలో అధిక రాబడులను ఆశిస్తున్నారా? అయితే, స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్న ఈ 9 స్టాక్స్ ను పరిశీలించండి. వాటిలో టాటా మోటార్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, లార్సెన్ అండ్ టుబ్రో తదితర 9 షేర్లు ఉన్నాయి.
Stocks to buy: ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అనిశ్చితిపై ఆందోళనలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ గత వారం గణనీయమైన పురోగతిని సాధించింది. నిఫ్టీ 50 మే 24 శుక్రవారం 23,026.40 వద్ద కొత్త గరిష్టాన్ని, సెన్సెక్స్ 75,636.5 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండూ 2 శాతం లాభపడటంతో వరుసగా రెండో వారంలోనూ ఇదే జోరు కొనసాగింది. ఈ రెండు బెంచ్ మార్క్ సూచీలు లాభాలను కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల రోజు దగ్గరపడుతున్న కొద్దీ స్టాక్ మార్కెట్ (Stock market) లో స్వల్పకాలిక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ త్వరలోనే 23,150-23,400 శ్రేణికి చేరుకునే అవకాశం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అంచనా వేస్తున్నారు. ఒకవేళ తగ్గితే 22,550-22,800 జోన్లు గట్టి మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు.
బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ పై దృష్టి పెట్టండి
అన్ని కీలక రంగాలు ర్యాలీకి దోహదపడుతున్నప్పటికీ, బ్యాంకింగ్, ఐటీలకు ఇప్పటికీ గణనీయమైన అవకాశాలు ఉన్నాయని, వాటి భాగస్వామ్యం సూచీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదని నిపుణులు ఆశిస్తున్నారు. ‘స్వల్పకాలిక ట్రేడింగ్ కోసం లార్జ్, మిడ్ క్యాప్ స్టాక్స్ వైపు మొగ్గు చూపుతూ స్టాక్-స్పెసిఫిక్ ట్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలని సిఫార్సు చేస్తున్నాము’’ అని మిశ్రా అన్నారు. మార్కెట్ రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ టెక్నికల్ ఛార్టుల్లో కొన్ని స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని, స్వల్పకాలిక లాభాల కోసం వాటిని కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. విశ్లేషకుల సిఫార్సుల ఆధారంగా కింది తొమ్మిది స్టాక్స్ స్వల్పకాలంలో రెండంకెల రాబడులను ఇవ్వవచ్చు.
స్వల్ప కాలంలో మంచి రాబడులను ఇచ్చే స్టాక్స్
- టాటా మోటార్స్: కొనుగోలు ధర రూ.960.55; టార్గెట్ ధర: రూ.1,200; స్టాప్ లాస్: రూ.909; లాభం: 25%
- టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్: కొనుగోలు ధర రూ.1,098.25; టార్గెట్ ధర: రూ.1,300; స్టాప్ లాస్: రూ.1,050; లాభం: 18%.
- ఎల్ అండ్ టీ: కొనుగోలు ధర రూ.3,625.90; టార్గెట్ ధర: రూ.4,000; స్టాప్ లాస్: రూ.3,400; లాభం: 10%.
- పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్: కొనుగోలు ధర రూ.796.45; టార్గెట్ ధర: రూ.900; స్టాప్ లాస్: రూ.742; లాభం: 12%.
- అతుల్: కొనుగోలు ధర రూ.5,880.20; టార్గెట్ ధర: రూ.6,650; స్టాప్ లాస్: రూ.5,760; లాభం: 13%.
- సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్: కొనుగోలు ధర రూ.140.15; టార్గెట్ ధర: రూ.160; స్టాప్ లాస్: రూ.128; లాభం: 14%.
- రామ్ కో ఇండస్ట్రీస్: కొనుగోలు ధర రూ.237.05; టార్గెట్ ధర: రూ.320; స్టాప్ లాస్: రూ.220; లాభం: 35%.
- సౌరాష్ట్ర సిమెంట్: కొనుగోలు ధర రూ.124; టార్గెట్ ధర: రూ.150; స్టాప్ లాస్: రూ.115; లాభం: 21%.
- లేటెంట్ వ్యూ ఎనలటిక్స్: కొనుగోలు ధర రూ.488.55; టార్గెట్ ధర: రూ.600; స్టాప్ లాస్: రూ.470; లాభం: 23%.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.