Best Family Safety Cars : టాటాకు చెందిన ఈ 5 ఎస్‌యూవీ కార్లు ఫ్యామిలీ సేఫ్టీకి బెస్ట్.. 5 స్టార్ రేటింగ్!
Best Family Safety Cars : కారు కొనేముందు కచ్చితంగా క్రాష్ టెస్ట్‌లో రేటింగ్ చూడటం ఇటీవల తప్పనిసరైపోయింది. ఎందుకుంటే ఫ్యామిలీ సేఫ్టీ కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు టాటాకు చెందిన కారు కొనే ఆలోచనలో ఉంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎస్‌యూవీలు ఏమున్నాయో ఓసారి చూడండి..
కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో కారు కొనుగోలు చేసేటప్పుడు సేఫ్టీ ముఖ్యమైన అంశంగా మారింది. సేఫ్టీ పరంగా చూస్తే టాటా మోటార్స్ కార్లదే ఆధిపత్యం అని చెప్పవచ్చు. 2024 సంవత్సరంలో భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కనిపించిన టాటాకు చెందిన 5 ఎస్‌యూవీలు 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
టాటా కర్వ్
టాటా కర్వ్ ఎస్‌యూవీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టాటా కర్వ్ లాంచ్ అయినప్పటి నుండి వినియోగదారుల నుండి మంచి స్పందనను పొందుతోంది. భారత్ ఎన్సీఏపీలో జరిగిన క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ పూర్తి 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ వయోజన భద్రతకు 32 పాయింట్లకు గాను 29.50 పాయింట్లు, పిల్లల భద్రతకు 49 పాయింట్లకు గాను 43.66 పాయింట్లు సాధించింది.
టాటా కర్వ్ ఈవీ
ఎలక్ట్రిక్ కార్లకు ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్ 2024 సంవత్సరంలో ఇండియన్ మార్కెట్లో టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో టాటా కర్వ్ ఈవీకి పూర్తి 5 స్టార్ రేటింగ్ లభించింది. టాటా కర్వ్ ఈవీ వయోజన భద్రత కోసం 32 పాయింట్లకు గాను 30.81 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు 44.83 పాయింట్లు పొందింది.
టాటా పంచ్ ఈవీ
టాటా మోటార్స్ 2024 సంవత్సరంలో టాటా పంచ్ ఈవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ ఎన్సీఏపీలో జరిగిన క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ ఈవీకి పూర్తి 5 స్టార్ రేటింగ్ లభించింది. టాటా పంచ్ ఈవీ క్రాష్ టెస్ట్‌లో వయోజన భద్రత కోసం 32 పాయింట్లకు గాను 31.46 పాయింట్లు, పిల్లల భద్రత కోసం 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు పొందింది.
టాటా నెక్సాన్ ఈవీ
ప్రసిద్ధ టాటా నెక్సాన్ ఈవీకి కూడా భారత్ ఎన్సీఏపీలో కుటుంబ భద్రత కోసం క్రాష్ టెస్ట్‌లో పూర్తి 5-స్టార్ రేటింగ్ పొందింది. టాటా నెక్సాన్ వయోజన భద్రతకు సంబంధించి 32 పాయింట్లకు గాను 29.86 పాయింట్లు, పిల్లల భద్రతకు సంబంధించి 49 పాయింట్లకు గాను 44.95 పాయింట్లు సాధించింది.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటి. భారత్ ఎన్సీఏపీ జరిగిన క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్‌కు పూర్తి 5-స్టార్ రేటింగ్ లభించింది. టాటా నెక్సాన్ పిల్లల భద్రతకు సంబంధించి 49 పాయింట్లకు గాను 43.83 పాయింట్లు, వయోజనుల భద్రత కోసం 32 పాయింట్లకు గాను 29.41 పాయింట్లు సాధించింది.