Stocks to buy : మార్కెట్ క్రాష్‌లోనూ భారీ రిటర్నులు ఇచ్చిన స్టాక్స్ ఇవి.. ఇన్వెస్టర్లకు పండగే!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు భారీగా పతనమయ్యాయి. కానీ 5 స్టాక్స్ మాత్రం 20శాతానికిపైగ రిటర్నులు ఇచ్చి, ఇన్వెస్టర్లను సంతోషపెట్టాయి. ఆ వివరాలు..

2024 అక్టోబర్ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా 2025 మొదటి రెండు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా కరెక్ట్ అయ్యాయి. స్టాక్స్‌తో పోల్చుకుంటే.. ఈ మధ్య కాలంలో బంగారంపై పెట్టుబడి మంచి రిటర్నులు ఇస్తోంది. ఈ రెండు నెలల్లోనే బంగారం భారీగా పెరగడం ఇందుకు కారణం. ఈ రెండు నెలల్లోనే బంగారం 12శాతానికి పైగా రిటర్నులు తెచ్చిపెట్టింది. అయితే, మార్కెట్లు ఎంత పడుతున్నా 5 ముఖ్యమైన స్టాక్స్ మాత్రం భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. ఇన్వెస్టర్స్‌కి మంచి రిటర్నులు ఇచ్చి సంతోషపెడుతున్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
స్టాక్ మార్కెట్ క్రాష్..
ముందుగా స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి మాట్లాడుకుంటే.. భారత ఈక్విటీ మార్కెట్లు 2025లో ఇప్పటివరకు దాదాపు రూ.45 లక్షల కోట్లు నష్టపోయాయి. 2024 సెప్టెంబర్ 27న ఆల్‌టైమ్ హైకి చేరినప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపద రూ.78 లక్షల కోట్లు పడిపోయింది!
త్రైమాసిక ఫలితాలు మందగించడం, ఎఫ్ఐఐ ప్రవాహాలు చైనా వైపు మళ్లడం, అమెరికా అనుకూల సెంటిమెంట్ మార్కెట్ క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 2025 ఫిబ్రవరి 13 నాటికి రూ.97,104 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాల కారణంగా భారత మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయని వివరిస్తున్నారు.
మార్కెట్ క్రాష్‌లోనూ ఈ స్టాక్స్‌లో లాభాలు..!
స్టాక్ మార్కెట్లు పడుతున్నా కొన్ని కంపెనీల షేర్లు మాత్రం బాగా రాణిస్తున్నాయి. అవేంటంటే..
ఎస్ఆర్ఎఫ్..
ఎస్ఆర్ఎఫ్ షేరు ధర 2025లో 26.38 శాతం రాబడిని ఇచ్చింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ 6.43 శాతానికి పైగా పెరిగింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సరికి ఎస్ఆర్ఎఫ్ షేరు ధర రూ. 2,705 వద్ద ముగిసింది.
నవీన్ ఫ్లోరిన్..
ఈ స్టాక్ 2025లో ఇప్పటివరకు 26.35 శాతం రాబడిని ఇచ్చింది. నెల రోజుల్లో ఈ స్టాక్ 6.57 శాతానికి పైగా పెరిగింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సరికి రూ. 4015 వద్ద స్థిరపడింది.
యూపీఎల్..
యూపీఎల్ షేర్లు ఈ ఏడాది ఇప్పటివరకు 23.85 శాతం రాబడినిచ్చాయి. గత నెల రోజుల్లో యూపీఎల్ స్టాక్ 13 శాతానికి పైగా పెరిగింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సరికి రూ. 617 వద్దకు చేరాయి.
ఎస్బీఐ కార్డ్స్..
ఎస్బీఐ కార్డ్స్ షేరు ధర 2025లో ఇప్పటివరకు 22.98 శాతం రాబడిని అందించింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ 13.85 శాతానికి పైగా పెరిగింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సరికి రూ. 857 వద్ద స్థిరపడింది.
బజాజ్ ఫైనాన్స్..
బజాజ్ ఫైనాన్స్ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు 20.39 శాతం రాబడిని ఇచ్చింది. బజాజ్ ఫైనాన్స్ స్టాక్ ఒక నెలలో 15.38 శాతానికి పైగా పెరిగింది. రూ. 8376 వద్ద ఈ స్టాక్ శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ముగించింది.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం