Hyundai Creta EV : హ్యుందాయ్ క్రెటా ఈవీకి చెందిన ఈ 5 ఫీచర్లు కస్టమర్లను క్రేజీగా ఫీల్ అయ్యేలా చేస్తాయి!
Hyundai Creta EV : హ్యుందాయ్ క్రెటా ఈవీని జనవరి 17న విడుదల చేయనుంది. ఇది కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ క్రెటాకు ఎలక్ట్రిక్ వేరియంట్‌గా వస్తుంది. దీంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
హ్యుందాయ్ ఇండియా జనవరి 17న క్రెటా ఈవీని తీసుకొస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ కోసం కస్టమర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ కావడంతో దీనిపై క్రేజ్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే క్రెటా ఈవీని భారత రోడ్లపై పలుమార్లు పరీక్షించారు. రాబోయే క్రెటా ఈవీకి చెందిన 5 ప్రధాన ఫీచర్ల కస్టమర్లను ఆకర్శిస్తాయి. అవేంటో చూద్దాం..
1. ఈ ఈవీ కంపెనీ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్. హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో ఇప్పటివరకు 11 లక్షల యూనిట్లకు పైగా ఎస్‌యూవీలను విక్రయించింది. ఈ కారణంగా ప్రజలు క్రెటా ఈవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.
2. హ్యుందాయ్ క్రెటా ఈవీలో కస్టమర్లకు 42 కిలోవాట్ల, 51.4 కిలోవాట్ల 2 బ్యాటరీ ప్యాక్‌లు లభిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 390 కిలోమీటర్లు, పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 473 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి.
3. మరోవైపు హ్యుందాయ్ క్రెటా ఈవీ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.9 సెకన్లలో అందుకుంటుంది. ఇది కాకుండా క్రెటా ఈవీలో మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లను కూడా అందించారు.
4. ఇందులో డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్లు ఉండనున్నాయి. ఈవీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇది కాకుండా క్రెటా ఈవి వాయిస్-యాక్టివేటెడ్ డ్యూయల్-ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ కూడా పొందుతుంది.
5. క్రెటా ఎలక్ట్రిక్ సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, సీట్ బెల్ట్ రిమైండర్ పొందుతుంది. ఈవీలో 360 డిగ్రీల కెమెరా, గేమ్ ఛేంజర్ లెవల్-2 ఏడీఏఎస్ సూట్‌తో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ప్రీ బుకింగ్‌లు గతంలోనే ప్రారంభించారు. రూ.25వేలు చెల్లించి.. క్రెటా ఈవీని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి హ్యుందాయ్ క్రెటా ఈవీ పవర్, అవుట్‌పుట్ వివరాలు ఇంకా తెలియదు. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లలో అందుబాటులో ఉంటుంది. క్రెటా ఈవీలో డిజిటల్ కీ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే జనవరి 17న జరిగే భారత్ మెుబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో వరకు వెయిట్ చేయాల్సిందే.