దీపావళి సందర్భంగా మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం గుడ్‌న్యూస్ ఉంది. ప్రస్తుతం చాలా కార్లపై విపరీతమైన వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ సమయంలో మీరు కొత్త కారు కొనడానికి చాలా నెలలు వేచి ఉండవలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా వివిధ నగరాల్లో కొన్ని మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. గాడివాడి అనే న్యూస్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం.. మీరు ఆర్డర్ చేసిన మరుసటి రోజు ఈ కార్లను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం వెయిటింగ్ పీరియడ్ లేని అలాంటి 5 మోడల్స్ గురించి తెలుసుకుందాం.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా లభిస్తుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో పెట్రోల్, హైబ్రిడ్, సీఎన్జీతో సహా 3 ఇంజన్ల ఎంపికను వినియోగదారులు పొందుతారు. ఫీచర్ల విషయానికి వస్తే మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, భద్రత కోసం 6-ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.
దేశంలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటి. ప్రస్తుతం మారుతి ఫ్రాంక్స్ పై వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా తక్కువ. పవర్ట్రెయిన్ విషయానికి వస్తే ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ బూస్టర్జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. వినియోగదారులు కారులో సీఎన్జీ పవర్ట్రెయిన్ ఎంపికను కూడా పొందుతారు. 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
హోండా ఎలివేట్ కంపెనీ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ. హైదరాబాద్, పుణె, చెన్నై నగరాల్లో నివసించే కస్టమర్లకు హోండా ఎలివేట్ లో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. పవర్ట్రెయిన్ పరంగా ఈ ఎస్‌యూవీలో కేవలం 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ కారులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ఏడీఎఎస్)తో పాటు సేఫ్టీ కోసం 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో ఏసీ, 6 ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి.
భారతీయ కస్టమర్లలో పాపులర్ ఎస్‌యూవీ అయిన కియా సోనెట్ కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉంది. కియా సోనెట్ లో 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సింగిల్ ప్యాన్ సన్ రూఫ్, భద్రత కోసం 6-ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.
కొంత కాలంగా కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. కియా సెల్టోస్ ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అందుబాటులో ఉంది. కియా సెల్టోస్ లోని పవర్ట్రెయిన్ ఎంపికలలో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, భద్రత కోసం 6-ఎయిర్ బ్యాగులు, లెవల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీ, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.