Trump Tariffs Pause : ట్రంప్ టారిఫ్ విరామం వల్ల ఈ ముగ్గురికి భారీగా లాభం.. ఒక్క రోజులో 80 బిలియన్ డాలర్లు-these 3 persons benefited 80 billion dollars in 1 day because of trump tariffs pause for 90 days ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Trump Tariffs Pause : ట్రంప్ టారిఫ్ విరామం వల్ల ఈ ముగ్గురికి భారీగా లాభం.. ఒక్క రోజులో 80 బిలియన్ డాలర్లు

Trump Tariffs Pause : ట్రంప్ టారిఫ్ విరామం వల్ల ఈ ముగ్గురికి భారీగా లాభం.. ఒక్క రోజులో 80 బిలియన్ డాలర్లు

Anand Sai HT Telugu

Trump Tariffs Pause : ట్రంప్ టారిఫ్‌లపై విరామం ప్రకటించిన వెంటనే టెస్లా, అమెజాన్, మెటా వంటి టెక్ కంపెనీల షేర్లు పెరిగాయి. ఎలన్ మస్క్ సంపద ఒక్కరోజులో రూ.35.9 బిలియన్లు పెరిగింది.

డొనాల్డ్ ట్రంప్

90 రోజుల పాటు సుంకాలను ఆపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ముగ్గురు బిలియనీర్లు ఎక్కువ ప్రయోజనం పొందారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్.. ఒకే రోజు దాదాపు 80 బిలియన్ డాలర్లు సంపాదించారు. ట్రంప్ సుంకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా పెరిగాయి. టెస్లా, అమెజాన్, మెటా వంటి టెక్ కంపెనీల షేర్లు బంపర్ జంప్ చేశాయి.

ఈ ముగ్గురి సంపద పెరిగింది

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ఎలన్ మస్క్ సంపద ఒక్కరోజులో రూ.35.9 బిలియన్లు పెరిగింది. మార్క్ జుకర్ బర్గ్ 25.9 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 18.5 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఎలన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇప్పటివరకు ఆయన సంపద 107 బిలియన్ డాలర్లు తగ్గింది. జెన్సన్ హువాంగ్ (ఎన్వీడియా సీఈఓ) 15.5 బిలియన్ డాలర్ల లాభంతో టాప్ 15లో చోటు దక్కించుకున్నారు. మార్క్ జుకర్ బర్గ్ సంపద ఈ ఏడాది కేవలం 723 మిలియన్ డాలర్లు మాత్రమే తగ్గింది. టెక్ టైకూన్లలో ఇదే అత్యల్పం.

టెక్ స్టాక్స్

ఎలన్ మస్క్ సంపద 35.9 బిలియన్ డాలర్లు పెరిగి 326 బిలియన్ డాలర్లకు చేరింది. బుధవారం టెస్లా షేర్లు దాదాపు 23 శాతం పెరిగాయి. ట్రంప్ ఇచ్చిన ఉపశమనం ప్రభావం టెక్ స్టాక్స్ పై ఎక్కువగా కనిపించింది. నాస్డాక్ 12.2 శాతం లాభపడింది. ఇది 2001 తరువాత అతిపెద్ద లాభం. మెటా షేర్లు దాదాపు 15 శాతం, అమెజాన్ షేర్లు దాదాపు 12 శాతం పెరిగాయి.

ఈ రెండు కంపెనీల షేర్ల పెరుగుదలతో మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్ సంపద బంపర్ గా పెరిగింది. మార్క్ జుకర్ బర్గ్ 25.8 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించారు. జెఫ్ బెజోస్ 18.5 బిలియన్ డాలర్లు పెరిగి మరోసారి 200 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరారు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ సంపద 210 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం