కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? వివిధ బ్యాంకుల కార్డుల గురించి తెలుసుకుని, వాటిలోని ఫీచర్స్‌ని పోల్చిన తర్వాత క్రెడిట్ కార్డు తీసుకోవడం ఉత్తమం. అప్పుడు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందించే మూడు క్రెడిట్ కార్డుల గురించి మేము ఇక్కడ చెప్పబోతున్నాము. వీటితో రివార్డులే కాదు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఈ మూడు కార్డులు.. క్రెడిట్ కార్డు, మనీబ్యాక్ + క్రెడిట్ కార్డ్, ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డుల కీలక ఫీచర్లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి..
I. మిలీనియ క్రెడిట్ కార్డ్:
ఏ. ఈ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో అమెజాన్, బుక్ మై షో, కల్ట్.ఫిట్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్, జొమాటోలో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
బి. ఇతర ఖర్చులపై అదనంగా 1 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
సీ. కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో రూ .1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఖర్చులపై రూ .1000 విలువైన గిఫ్ట్ వోచర్లను పొందొచ్చు.
డీ. కూపన్ కోడ్ HDFCCARD ఉపయోగించి స్విగ్గీ డైనౌట్పై 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
2. మనీబ్యాక్+ క్రెడిట్ కార్డు:
ఏ. ఈ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ స్మార్ట్ సూపర్‌స్టోర్, స్విగ్గీలలో 10x క్యాష్ పాయింట్స్.
బీ. వ్యాపార ప్రదేశాలలో ఈఎమ్ఐ ఖర్చులపై 5X క్యాష్ పాయింట్స్.
C. అన్ని ఇతర ఖర్చులపై రెండు క్యాష్ పాయింట్లు (ఇంధనం, వాలెట్ లోడ్లు మినహా)
D. సంవత్సరానికి రూ.2,000 వరకు విలువైన గిఫ్ట్ వోచర్లు.
3. ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్:
ఏ. మర్చంట్ లొకేషన్‌ల్లో ఈఎమ్ఐ ఖర్చులపై 5X క్యాష్ పాయింట్ లను సంపాదించండి.
బీ. ఇతర ఖర్చులపై ప్రతి రూ.150కు 1 క్యాష్ పాయింట్ సంపాదించండి (ఇంధనం, వాలెట్ లోడ్ లు మినహాయించి).
C. మీకు ఇష్టమైన వ్యాపారులపై 10X క్యాష్ పాయింట్లను సంపాదించండి (బిగ్ బాస్కెట్, బుక్ మైషో, ఓయో, స్విగ్గీ, ఊబర్).
ఈ విధంగా షాపింగ్ లేదా ఖర్చు చేస్తూనే రివార్డు పాయింట్స్, క్యాష్‌బ్యాక్ పొంది డబ్బులను ఆదా చేసుకోండి.
సంబంధిత కథనం