లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌లోకి ఆల్టెరో.. - హైదరాబాద్‌లో తొలి స్టోర్ ప్రారంభం-the altero new store brings european flair to hyderabads furniture scene ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  The Altero New Store Brings European Flair To Hyderabads Furniture Scene

లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌లోకి ఆల్టెరో.. - హైదరాబాద్‌లో తొలి స్టోర్ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Feb 29, 2024 02:11 PM IST

లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌‌తో కూడిన తన తొలి స్టోర్‌ను ఆల్టెరో హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీనిని 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో ఏర్పాటు చేశారు.

ఆల్టెరో ఎండీ చందన కోగంటి
ఆల్టెరో ఎండీ చందన కోగంటి

హైదరాబాద్‌: లగ్జరీ యూరోపియన్‌ ఫర్నీచర్‌ మార్కెట్లోకి ఆల్టెరో ఎంట్రీ ఇచ్చింది. మూడు అంతస్తుల్లో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో ఏర్పాటైన తొలి స్టోర్‌ను కంపెనీ గురువారం ప్రారంభించింది. ప్రధానంగా యూరప్‌లో డిజైన్‌, తయారీ చేపట్టిన వినూత్న, నాణ్యమైన లగ్జరీ ఫర్నీచర్‌ను సరసమైన ధరల్లో విక్రయిస్తామని ఆల్టెరో ఎండీ చందన కోగంటి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ధర రూ. 5 లక్షలతో ప్రారంభమై రూ.5 కోట్ల వరకు ఉంటుందన్నారు. ప్రతి ఉత్పాదన డిజైన్‌, కలర్‌ వేటికవే ప్రత్యేకమని చెప్పారు. కస్టమర్ల అభిరుచులకు తగ్టట్టుగా ఆల్టెరో నిపుణుల బృందం విభిన్న ఉత్పత్తులను సూచిస్తుందని వివరించారు. ఔట్‌డోర్‌ ఫర్నీచర్‌ సైతం ఆఫర్‌ చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

అంతర్జాతీయ బ్రాండ్స్‌..

ఇటలీలో ఫర్నీచర్‌ తయారీలో అతిపెద్ద సంస్థ అయిన అరాన్‌ కుచీనే బ్రాండ్‌ ఫిక్స్‌డ్‌ ఫర్నీచర్‌ కోసం ప్రత్యేకంగా రెండవ అంతస్తు కేటాయించారు. అరాన్‌ కుచీనే కిచెన్స్‌, వాడ్రోబ్స్‌, ఆఫీస్‌ ఫర్నీచర్‌ ఇక్కడ లభిస్తుంది. జార్జియో కలెక్షన్‌, ఘీడీని 1961, కాంటోరీ, రోజినీ డివానీ, స్కాప్పినీ హోమ్‌, మరెల్లి, ప్లస్ట్‌, మిండో వంటి అంతర్జాతీయంగా పేరొందిన బ్రాండ్స్‌కు చెందిన లూజ్‌ ఫర్నీచర్‌ ఇక్కడ కొలువుదీరాయి. స్పెయిన్‌, పోర్చుగల్‌, ప్యారిస్‌, డెన్మార్క్‌లో తయారైన ఫర్నీచర్‌ సైతం విక్రయిస్తారు. లగ్జరీ ఫర్నీచర్‌ మార్కెట్‌ గురించి విస్తృతంగా పరిశోధన చేశామని చందన తెలిపారు. ఉత్పత్తులు రిపీట్‌ కాకుండా జాగ్రత్తపడ్డామని చెప్పారు. వినియోగదార్లు కోరిన బ్రాండ్ల ఫర్నీచర్‌ను దిగుమతి చేసి సరఫరా చేస్తామని తెలిపారు.

హై ఎండ్‌ గృహాలు వస్తున్నాయి..

రియల్టీ రంగంలో వృద్ధి మార్కెట్లలో హైదరాబాద్‌ ఒకటని చందన తెలిపారు. ‘హైదరాబాద్‌లో అపార అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో లగ్జరీ హోమ్స్‌ వచ్చే అయిదేళ్లలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.

6,000 నుంచి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి ఏర్పాటవుతున్నాయి. పెద్ద క్లయింట్స్‌ అంతా నాణ్యమైన, ఖరీదైన ఫర్నీచర్‌ కోరుకుంటారు. ఒకరి ఇంట్లో ఉన్నవి తమ ఇంట్లో ఉండకూడదన్న ఆలోచన కస్టమర్లలో ఉంది. అందుకే ప్రత్యేక, ఖరీదైన ఫర్నీచర్‌ను కోరుకుంటున్నారు. ఆల్టెరోకు ఈ అంశాలు కలిసి వస్తాయి. ఫర్నీచర్‌ రంగంలో ప్రత్యేకత చూపిస్తాం’ అని వివరించారు. భారత లగ్జరీ ఫర్నీచర్‌ విపణి 2023లో రూ.36,100 కోట్లు ఉంది. ఏటా 4.24 శాతం వార్షిక వృద్ధితో పరిశ్రమ 2029 నాటికి రూ. 44,400 కోట్లకు చేరుతుందని అంచనా అని కంపెనీ తెలిపారు.

WhatsApp channel

టాపిక్