Tesla in India : ఇండియలోకి టెస్లా- ఏప్రిల్​ నుంచి సేల్స్​! ఎలక్ట్రిక్​ కారు ధర ఎంతో తెలుసా?-tesla showrooms in india to be located in these two cities says report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla In India : ఇండియలోకి టెస్లా- ఏప్రిల్​ నుంచి సేల్స్​! ఎలక్ట్రిక్​ కారు ధర ఎంతో తెలుసా?

Tesla in India : ఇండియలోకి టెస్లా- ఏప్రిల్​ నుంచి సేల్స్​! ఎలక్ట్రిక్​ కారు ధర ఎంతో తెలుసా?

Sharath Chitturi HT Telugu

Tesla in India : ఇండియాలో టెస్లా ఎంట్రీకి వేగంగా అడుగులుపడుతున్నాయి! దేశంలో రెండు ప్రధాన నగరాల్లో టెస్లా తన షోరూమ్స్​ని ఓపెన్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టెస్లా మోడల్​ వై ఈవీ.. (AFP)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం.. ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఎంట్రీకి వేగంగా అడుగులుపడుతున్నట్టు కనిపిస్తోంది! ఇండియాలో ఉద్యోగుల అన్వేషణలో ఉన్న టెస్లా.. ఇప్పుడు దేశంలో షోరూమ్స్​ని ఏర్పాటు చేసి, ఏప్రిల్​ నుంచే సేల్స్​ ప్రారంభించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు ప్రధాన నగరాల్లో టెస్లా షోరూమ్స్​ రానున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఆ రెండు నగరాల్లో టెస్లా షోరూమ్స్​..!

వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. దేశ రాజధాని దిల్లీ, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో షోరూమ్స్​ని ఓపెన్​ చేయాలని ఎలాన్​ మస్క్​కి చెందిన టెస్లా నిర్ణయించుకుంది.

ప్రపంచంలో మూడొవ అతిపెద్ద ఆటో మార్కెట్లోకి ప్రవేశించడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు గత కొన్నేళ్లుగా ప్లాన్​ చేస్తోంది. భారతదేశంలో టెస్లా షోరూమ్స్​ వేట గత ఏడాది కాలంగా కొనసాగుతోంది. కానీ దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై అధిక సుంకాలు ఉండటంతో టెస్లా భారతదేశంలో ప్రవేశించే ప్రణాళికలకు ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఇక మోదీ అమెరికా పర్యటనలో ఎలాన్​ మస్క్​తో భేటీతో ఇండియాలోకి టెస్లా ఎంట్రీ పనులు పున:ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే రెండు నగరాల్లో షోరూమ్స్​ ఏర్పాటుకు సంస్థ ప్లాన్​ చేస్తోందని సమాచారం.

నివేదిక ప్రకారం.. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఏరోసిటీ ప్రాంతంలో టెస్లా షోరూమ్ ఉంటుంది. హోటళ్లు, రిటైల్ ఔట్​లెట్స్​, గ్లోబల్ కంపెనీల కార్యాలయాలకు దగ్గరగా ఉండటం వల్ల టెస్లా ఏరోసిటీని ఎంచుకుందని ఈ పరిణామాల గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. ముంబైలోని టెస్లా షోరూమ్.. విమానాశ్రయానికి సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉండనుంది.

దిల్లీ, ముంబైలో టెస్లా షోరూమ్స్​ సుమారు 5,000 చదరపు అడుగుల స్థలాల్లో ఉంటాయని, వీటిని అధికారికంగా ప్రారంభించే తేదీలను ఇంకా నిర్ణయించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్ నుంచి ఇండియాలో టెస్లా సేల్స్​?

మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్​ నుంచే ఇండియాలో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ని సేల్​ చేసేందుకు టెస్లా ప్లాన్​ చేస్తోందని సమాచారం. పలు నివేదికల ప్రకారం ఇండియాలో టెస్ల్​ మొదటి ఈవీ ధర 25000 డాలర్ల (సుమారు రూ. 21లక్షలు) లోపు ఉంటుంది.

ప్రారంభంలో, టెస్లా తన దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లను ఈ షోరూమ్స్​ ద్వారా విక్రయించాలని భావిస్తోంది. టెస్లా తరువాతి తేదీలో స్థానిక అసెంబ్లింగ్ లేదా తయారీలోకి ప్రవేశించవచ్చు. టెస్లా భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు మోడల్ 3, మోడల్ ఎస్, మోడల్ వై ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మోడళ్లను విడుదల చేసే అవకాశం ఉంది.

ఉద్యోగుల వేటలో టెస్లా..

టెస్లా ఎంట్రీలో మరో కీలక అప్డేట్​.. దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల సంస్థ ఇండియాలో ఉద్యోగుల వేటలో పడటం! కస్టమర్-ఫేసింగ్, బ్యాక్-ఎండ్ ఉద్యోగాలతో పాటు 13 రోల్స్​కి అభ్యర్థులను కోరుతూ లింక్డ్​ఇన్​లో టెస్లా ప్రకటనలను పోస్ట్ చేసింది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ మేనేజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ తదితర పోస్టులకు టెస్లా దరఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం