Tesla in India : ఉద్యోగుల వేటాలో టెస్లా- ఇండియాలో ఎంట్రీ ఖాయం!-tesla in india elon musk company starts hiring after meeting with pm modi ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla In India : ఉద్యోగుల వేటాలో టెస్లా- ఇండియాలో ఎంట్రీ ఖాయం!

Tesla in India : ఉద్యోగుల వేటాలో టెస్లా- ఇండియాలో ఎంట్రీ ఖాయం!

Sharath Chitturi HT Telugu
Published Feb 18, 2025 09:55 AM IST

Tesla jobs in India : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అనంతరం టెస్లా నుంచి బిగ్​ అప్డేట్​! ఇండియాలో ఈ సంస్థ ఉద్యోగుల వేటలో పడింది. ఈ మేరకు లింక్డ్​ఇన్​ పోస్ట్​లో వివిధ రోల్స్​ని ప్రకటించింది.

యూఎస్​ రోడ్లపై టెస్లా కారు..
యూఎస్​ రోడ్లపై టెస్లా కారు.. (Bloomberg)

దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ​ సంస్థ టెస్లా, ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడంపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోందంటూ గతేడాది టెస్లా ఇండియా ప్లాన్స్​పై చాలా రూమర్స్​ వినిపించాయి. ఇక ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటన అనంతరం ఎలాన్​ మస్క్​కి చెందిన ఈ కంపెనీ నుంచి బిగ్​ అప్డేట్​ వచ్చింది! భారత దేశంలో ఉద్యోగుల వేటాలో పడింది టెస్లా. ఈ మేరకు లింక్డ్​ఇన్​లో వివిధ రోల్స్​ కోసం అప్లికేషన్లు ఆహ్వానించింది. ఎలాన్​ మస్క్​- మోదీ మధ్య చర్చలు జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వార్త బయటకు రావడం విశేషం.

ఉద్యోగుల వేటాలో టెస్లా..

ఇండియాలో ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషిస్తుండటంతో వాహన తయారీదారు రానున్న రోజుల్లో ఇండియాలోకి ప్రవేశించే అవకాశలు మరింత పెరిగాయనే చెప్పుకోవాలి. ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు సోమవారం తన లింక్డ్ఇన్ పేజ్​లో వివిధ రోల్స్​ కోసం ప్రకటనలను పోస్ట్ చేసింది. ఇవి.. దేశంలో అధికారిక అమ్మకాల కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు టెస్లా తన సహాయక బృందాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సూచిస్తుంది.

కస్టమర్-ఫేసింగ్, బ్యాక్-ఎండ్ ఉద్యోగాలతో పాటు 13 రోల్స్​కి అభ్యర్థులను కోరుతూ టెస్లా ప్రకటనలను పోస్ట్ చేసింది. కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఆర్డర్ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్ట్, సర్వీస్ మేనేజర్, ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, స్టోర్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ తదితర పోస్టులకు టెస్లా దరఖాస్తులు కోరుతోంది.

సర్వీస్ టెక్నీషియన్ మొదలుకొని వివిధ అడ్వైజర్​ రోల్స్​ సహా ఈ పోస్టుల్లో కనీసం ఐదు దిల్లీ, ముంబై రెండింటిలో అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ ఎంగేజ్​మెంట్ మేనేజర్స డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి మిగిలిన పోస్ట్​లు ముంబై కోసం ఉన్నాయి.

టెస్లా అధికారికంగా దేశంలోకి ప్రవేశించినప్పుడు దిల్లీ, ముంబై రెండింటిలో తన షోరూమ్​ని ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇది సూచిస్తుంది.

ఇండియాలోకి టెస్లా- ఇప్పటివరకు ఇలా..

టెస్లా -భారతదేశం చాలా సంవత్సరాలుగా ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్​ కొనసాగుతోందనే చెప్పుకోవాలి. రెండు, మూడేళ్లుగా టెస్లాతో భారత అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. 2024 లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో మస్క్​ ఇండియాకి వచ్చి, మోదీతో టెస్లా విషయంపై చర్చలు జరపాలని ప్లాన్​ చేశారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దు అయ్యింది. ఆ తర్వాత ఇండియాలో టెస్లా ప్లాంటు కోసం భూమిని వెతుకుతోందని వార్తలు వినిపించాయి. అవేవీ నిజం అవ్వలేదు.

భారత మార్కెట్ గురించి టెస్లా పదేపదే వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళనలలో ఒకటి అధిక దిగుమతి సుంకాలు!

కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్థానిక తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేసే కంపెనీలకు భారత ప్రభుత్వం గత ఏడాది మార్చ్​లో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ 2025లో 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన హైఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (బీసీడీ) 110 శాతం నుంచి 70 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఇది టెస్లా వంటి బ్రాండ్లకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. గతంలో టెస్లా సీఈఓ మస్క్ ప్రధాన అడ్డంకిగా అభివర్ణించిన అధిక దిగుమతి సుంకం సమస్యను భారత ప్రభుత్వం ఈ విధంగా పరిష్కరించింది. ఆ వెంటనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన, మస్క్​తో భేటీ జరిగింది. ఆ వెంటనే, ఇండియాలో ఉద్యోగుల కోసం టెస్లా అన్వేషణతో పరిస్థితులు సానుకూలంగా మారాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం