Tesla Cars : ఏప్రిల్‌లో ఇండియాలోకి టెస్లా.. అసలు ఈ ఎలక్ట్రిక్ కార్లు అమెరికాలో ఎందుకంత ఫేమస్?!
Tesla Cars In India : ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలోన్ మస్క్ సంస్థ టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. అయితే టెస్లా ఎలక్ట్రిక్ కార్లు అమెరికాలో ఎందుకు ప్రాచుర్యం పొందాయి? ఆ వివరాలేంటో చూద్దాం..

టెస్లా ఎలక్ట్రిక్ కార్లు భారతదేశంలోకి అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉద్యోగులను కూడా టెస్లా రిక్రూట్ చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఏప్రిల్‌లో టెస్లా తన మెుదటి షోరూమ్ ప్రారంభించనుందని, అప్పుడే ఈ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇండియాలోకి రానుందని అంటున్నారు. వీటన్నింటి మధ్య.. అసలు టెస్లా కారుకు అమెరికాలో ఎందుకు అంత ఫేమస్ అని తెలుసుకుందాం..
ఎందుకు ఫేమస్?
టెస్లా కంపెనీ తన కార్ల ఆవిష్కరణ, అత్యుత్తమ పనితీరు, పర్యావరణ అనుకూలత, అత్యాధునిక డిజైన్, ఫీచర్ల కారణంగా అమెరికాలో ప్రజాదరణ పొందింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విస్తృతమైన సూపర్‌చార్జర్ నెట్‌వర్క్‌లు కూడా టెస్లా కార్ల కొనుగోలుదారులను ఆకర్షించాయి. ఎలోన్ మస్క్ కూడా సోషల్ మీడియా ద్వారా టెస్లా కంపెనీ కార్ల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇది కూడా జనాల్లో ఈ కారు గురించి ఎప్పుడూ చర్చించేందుకు ఓ కారణమైంది.
ప్రజల్లో ఆసక్తి
టెస్లా సైబర్‌ట్రక్ సహా ఇతర మోడళ్ల పట్ల ప్రజలలో విపరీతమైన అభిమానం ఉంది. భారతదేశంలోని ప్రజలు కూడా టెస్లా కారు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెస్లా తన కార్లను అమెరికాలో ప్రాచుర్యం పొందేందుకు అనేక పద్ధతులను అనుసరించింది. ప్రభుత్వ మద్దతు, సోషల్ మీడియాను బాగా ఉపయోగించడం, వేలాది ఛార్జింగ్ స్టేషన్లు ప్రజలు టెస్లా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని పెంచాయి.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ
టెస్లా తన కార్ల కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడుతుంది. ఈ కార్లు ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అధిక వేగంతో వెళ్లగలవు. ఎలక్ట్రిక్ కార్లు కావడంతో పర్యావరణానికి కూడా మంచివి. అందుకే ప్రజలు వాటిని చాలా ఇష్టపడతారు. కంపెనీ లాంగ్-రేంజ్ బ్యాటరీలు, సూపర్‌చార్జర్ నెట్‌వర్క్‌లు, డ్రైవర్-సహాయ వ్యవస్థలను నిర్మించింది. ఇవన్నీ టెస్లా కార్లను ప్రత్యేకంగా చేశాయి.
వేగంతోపాటు మంచి రేంజ్
టెస్లా కార్లు పెట్రోల్ కార్ల కంటే వేగంగా, ఎక్కువ రేంజ్‌తో వెళ్తాయి. టెస్లా మోడల్ వై, మోడల్ 3, మోడల్ ఎస్ వేగం, రేంజ్‌కి ప్రసిద్ధి చెందాయి. ఈ కార్లు రెప్పపాటులో చాలా ఫాస్ట్‌గా వెళ్తాయి. టెస్లా కార్లు పెద్ద టచ్‌స్క్రీన్‌లు, ఆటోపైలట్ వంటి కొత్త ఫీచర్లతోపాటుగా మరెన్నో కలిగి ఉంటాయి. టెస్లా అమెరికాలో తన బ్రాండ్ పేరుపై విశ్వాసాన్ని క్రియేట్ చేసుకుంది.
అమెరికా ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడానికి పన్ను మినహాయింపులు, ఇతర సహాయాన్ని అందిస్తుంది. ఇది టెస్లా కార్లను కొనుగోలు చేయడం మరింత ఈజీగా చేసింది. ప్రభుత్వ ఈ విధానం పర్యావరణానికి కూడా మంచిది.
సంబంధిత కథనం