Elon Musk salary : రూ. 46,78,81,40,00,000.. ఇదీ ఎలాన్​ మస్క్​ జీతం!-tesla ceo elon musk pay package bigger than tata motors sbi tcs revenue ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elon Musk Salary : రూ. 46,78,81,40,00,000.. ఇదీ ఎలాన్​ మస్క్​ జీతం!

Elon Musk salary : రూ. 46,78,81,40,00,000.. ఇదీ ఎలాన్​ మస్క్​ జీతం!

Sharath Chitturi HT Telugu
Published Jun 15, 2024 09:00 AM IST

Elon Musk salary : ఎలాన్​ మస్క్​కి 56 బిలియన్​ డాలర్ల జీతాన్ని ఇచ్చేందుకు ఇన్​వెస్టర్లు ఒప్పుకున్నారు! ఇప్పుడాయన జీతం.. టాటా మోటార్స్​ రెవెన్యూ కన్నా అధికం!

ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​

Elon Musk salary : టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​కి 56 బిలియన్​ డాలర్ల పే ప్యాకేజ్​ని ఇన్​వెస్టర్లు ఆమోదించడం ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింంది. 56 బిలియన్​ డాలర్లు అంటే.. రూ. 46,78,81,40,00,000! ఒక వేళ ఎలాన్​ మస్క్​ ఒక భారత కంపెనీ అయ్యుంటే.. రెవన్యూ పరంగా 5వ అతిపెద్ద సంస్థగా ఉండేది.

టాటా మోటార్స్​, ఎస్​బీఐ కన్నా అధికం..!

టెస్లాని శరవేగంగా అభివృద్ధి చేస్తున్న ఎలాన్​ మస్క్​ ప్రతిభను గుర్తిస్తూ.. భారీ పే ప్యాకేజ్​ని బహుమతిగా ఇచ్చారు ఇన్​వెస్టర్లు. 56 బిలియన్​ డాలర్ల ప్యాకేజీకి ఆమోద ముద్రవేశారు. ఇది.. ఇండియాలోని భారత్​ పెట్రోలియం రెవెన్యూ కన్నా అధికం!

అంతేకాదు.. ఎలాన్​ మస్క్​.. ఒక ఇండియా కంపెనీ అయ్యుంటే, ఆయన జీతం.. భారత్​ పెట్రోలియం (54.03 బిలియన్​ డాలర్లు), టాటా మోటార్స్​ (52.43 బిలియన్​ డాలర్లు), హిందుస్థాన్​ పెట్రోలియం (52.09 బిలియన్​ డాలర్లు) ఎస్​బీఐ (40.35 బిలియన్​ డాలర్లు), రాజేశ్​ ఎక్స్​పోర్ట్స్​ (37.48 బిలియన్​ డాలర్లు), టీసీఎస్​ (29.04 బిలియన్​ డాలర్లు) రెవెన్యూ కన్నా ఎక్కువగా ఉంటుందని.. కంపెనీమార్కెట్​క్యాప్​.కామ్​ నివేదిక పేర్కొంది.

Elon Musk Tesla package : రిలయన్స్​ ఇండస్ట్రీస్​ (108.62 బిలియన్​ డాలర్లు), ఎల్​ఐసీ (96.10 బిలియన్​ డాలర్లు), ఇండియన్​ ఆయిల్​ (93.84 బిలియన్​ డాలర్లు), ఓఎన్​జీసీ (77.54 బిలియన్​ డాలర్లు) అనంతరం.. ఎలాన్​ మస్క్​ పే ప్యాకేజ్​ నిలుస్తుంది.

టెస్లాని ఎలాన్​ మస్క్​ ముందుండి నడిపిస్తున్నా.. దిగ్గజ ఎలక్ట్రిక్​ ఆటోమొబైల్​ సంస్థకు విపరీతమైన పోటీ ఎదురువుతూ కంపెనీ సేల్స్​ పడిపోతున్న సమయంలో.. ఇంతటి భారీ జీతాన్ని ఇన్​వెస్టర్లు ఆమోదించడం గమనార్హం. జనవరి- మార్చ్​ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 8.69శాతం పతనమై 21,301 మిలియన్​ డాలర్లకు పడిపోయింది. 2024 క్యాలెండర్​ ఇయర్​లో.. కంపెనీ.. తన 26.33శాతం మార్కెట్​ వాటాను కోల్పోయింది. అయినప్పటికీ.. మార్కెట్​ షేరు పరంగా టెస్లా నెంబర్​.1 స్థానంలో కొనసాగుతోంది.

భారీ జీతమే కానీ..!

Elon Musk latest news : ఇన్​వెస్టర్లు ఆమోదించినంత మాత్రాన.. టెస్లాకు ఈ ప్యాకేజ్​ వెంటనే దక్కదు! ఇందుకు కారణం అమెరికాలో ఒక కేసు.

2018 పే ప్యాకేజ్​ విషయంలో ఒక కేసు దాఖలైంది. నాడు.. ప్యాకేజ్​లోని పూర్తి వివరాలు ఇన్​వెస్టర్లకు చెప్పలేదని ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా.. సుదీర్ఘ విచారణ అనంతరం.. పే ప్యాకేజ్​ని ఈ జనవరిలో ఇన్​వాలిడేట్​ చేసింది కోర్టు.

దానిని కూడా తాజా పే ప్యాకేజ్​ వ్యవహారంలో మదుపర్లకు చెప్పింది టెస్లా. కోర్టు తీర్పును వ్యతిరేకించేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు పేర్కొంది. ఇదంతా అయ్యేందుకు చాలా కాలం పడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం