Bank holidays in Augut 2024 : ఆగస్ట్​లో బ్యాంక్​లకు ఎన్ని రోజులు సెలవు అంటే..-telangana bank holidays in augut 2024 independence day and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In Augut 2024 : ఆగస్ట్​లో బ్యాంక్​లకు ఎన్ని రోజులు సెలవు అంటే..

Bank holidays in Augut 2024 : ఆగస్ట్​లో బ్యాంక్​లకు ఎన్ని రోజులు సెలవు అంటే..

Sharath Chitturi HT Telugu
Published Jul 26, 2024 01:05 PM IST

Telangana Bank holidays in August 2024 : దేశవ్యాప్తంగా ఆగస్ట్​ నెలకు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ బయటకు వచ్చింది. వచ్చే నెలలో బ్యాంక్​లకు ఎన్ని రోజుల సెలవులు ఉంటాయంటే..

ఆగస్ట్​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​..
ఆగస్ట్​లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​..

ఆగస్ట్​ 2024లో వివిధ మతపరమైన సెలవులు, జాతీయ సెలవులు, ప్రాంతీయ వేడుకలు, వీకెండ్​ హాలీడే కారణంగా బ్యాంక్​లకు కనీసం 13 షెడ్యూల్డ్ సెలవులు లభిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) సహా భారతదేశంలోని అన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులకు వారి ప్రాంతీయ పండుగలను బట్టి ఆగస్ట్​ 2024 లో కనీసం 13 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులో నెలలో రెండు నాల్గొవ శనివారాలు, అన్ని ఆదివారాలు కూడా ఉన్నాయి.

ప్రాంతీయ వేడుకలు, పండుగల కారణంగా బ్యాంక్​ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలి. ఈ మేరకు సంబంధిత బ్యాంక్​కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మీ బ్యాంక్​ కార్యకలాపాలను బాగా ప్లాన్ చేయడానికి, చివరి నిమిషంలో గందరగోళం, అత్యవసర పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది.

సంవత్సరానికి సంబంధించిన బ్యాంకుల హాలిడే క్యాలెండర్​ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందువల్ల, రాష్ట్రాల్లోని స్థానిక ఆచారాల కారణంగా షెడ్యూల్స్ మారవచ్చు.

జులైలో బ్యాంక్​లకు మొత్తం 12 రోజుల పాటు సెలవులు లభించాయి.

ఆగస్ట్​ 2024లో బ్యాంక్​ సెలవుల లిస్ట్​..

ఆగస్ట్​ 3, శనివారం:- కెర్​ పూజ, అగర్తలలోని బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 8, గురువారం:- టెండాంగ్​ లూ రుమ్​ ఫత్​, గ్యాంగ్​టక్​లోని బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 13, మంగళవారం:- పేట్రియట్స్​ డే, ఇంఫాల్​లోని బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 15, గురువారం:- భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవం, దేశంలోని అన్ని బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 19, సోమవారం:- రక్షాబంధన్​, ఝులాన పూర్ణిమ, బీర్​ బిక్రిమ్​ కిశోర్​ మాణిక్య బహదూర్​ జయంతి. అగర్తల, అహ్మదాబాద్​, భువనేశవర్​, డెహ్రాడూన్​,జైయ్​పూర్​, కాన్పూర్​, లక్నో, శిమ్లాలోని బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 20, మంగళవారం:- శ్రీ నారాయణ గురు జయంతి, కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంక్​లకు సెలవు.

ఆగస్ట్​ 26, సోమవారం:- కృష్ణాష్టమి. అహ్మదాబాద్​, భువనేశ్వర్​, ఛండీగఢ్​, చెన్నై, డెహ్రడూన్​, గ్యాంగ్​టక్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జైపూర్​, జమ్ము, కాన్పూర్​, కోల్​కతా, లక్నో, పట్నా, రాయ్​పూర్​, రాంచీ, షిల్లాంగ్​, శిమ్లా, శ్రీనగర్​లోని బ్యాంక్​లకు సెలవు.

వీటితో పాటు వారాంతం సెలవులు కూడా బ్యాంక్​లకు లభిస్తాయి. అవి..

వారాంతం సెలవులు..

ఆగస్ట్​ 4:- ఆదివారం.

ఆగస్ట్​ 10:- రెండో శనివారం

ఆగస్ట్​ 11:- ఆదివారం

ఆగస్ట్​ 18:- ఆదివారం

ఆగస్ట్ ​24:- నాలుగో శనివారం

ఆగస్ట్​ 25:- ఆదివారం

వారంతపు సెలవుల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడి ఉంటాయి.

ఇవి పని చేస్తాయి..

ఖాతాదారుల సౌలభ్యం కోసం బ్యాంకు సెలవులు, వారాంతాలతో సంబంధం లేకుండా ఆన్​లైన్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకంగా కొనసాగుతాయి. అత్యవసర లావాదేవీల కోసం బ్యాంకుల వెబ్​సైట్లు, మొబైల్ యాప్​లు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే, మీకు బ్యాంకు సిబ్బంది నుంచి సహాయం కావాల్సి వస్తే మాత్రం, బ్యాంక్ హాలిడే షెడ్యూల్ గురించి తెలుసుకోవడం దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు.

మీరు మీ సమీపంలోని బ్యాంక్​ బ్రాంచ్​కి వెళితే పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం