TECNO Spark Go 2024 : టెక్నో స్పార్క్​ గో కొత్త ఎడిషన్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!-tecno spark go 2024 launched check price and features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tecno Spark Go 2024 : టెక్నో స్పార్క్​ గో కొత్త ఎడిషన్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

TECNO Spark Go 2024 : టెక్నో స్పార్క్​ గో కొత్త ఎడిషన్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Dec 05, 2023 12:24 PM IST

TECNO Spark Go 2024 : టెక్నో స్పార్క్​ గో 2024 ఎడిషన్​ లాంచ్​ అయ్యింది. ఈ మొబైల్​ ఫీచర్స్​ వివరాలివే..

టెక్నో స్పార్క్​ గో సిరీస్​ లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!
టెక్నో స్పార్క్​ గో సిరీస్​ లాంచ్​.. ధర, ఫీచర్స్​ ఇవే!

TECNO Spark Go 2024 : టెక్నో సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీని పేరు టెక్నో స్పార్క్​ గో 2024. ఈ మోడల్​.. టెక్నో స్పార్క్​ గో 2023కి లేటెస్ట్​ ఎడిషన్​. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.

టెక్నో స్పార్క్​ గో 2024 ఫీచర్స్​..

స్మార్ట్​ఫోన్​లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో 6.56 ఇంచ్​ హెచ్​డీ+ ఎల్​సీడీ ఐపీఎస్​ డిస్​ప్లే ఉంటుంది. సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, పాండా స్క్రీన్​ ప్రొటక్షన్​ వంటివి లభిస్తున్నాయి. ఈ మొబైల్​లో యూనిఎస్​ఓసీ టీ606 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంటుంది. 8జీబీ ర్యామ్​- 64జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ వేరియంట్స్​ దీని సొంతం. ఈ టెక్నో స్పార్క్​ గో 2024.. ఆండ్రాయిడ్​ 13 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది.

TECNO Spark Go 2024 price : ఇక ఈ మొబైల్​లో13ఎంపీ ప్రైమరీతో కూడిన డ్యూయెల్​ రేర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ కెమెరా లభిస్తోంది. డీటీఎస్​ సౌండ్​ టెక్నాలజీతో కూడిన డ్యూయెల్​ స్టీరియో స్పీకర్స్​ ఇందులో ఉంటాయి. 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 10వాట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. డ్యూయెల్​ సమ్​, 4జీ, వైఫై, బ్లూటూత్​ 5.0, జీపీఎస్​, టైప్​-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్​ ఉంటాయి.

ఈ స్మార్ట్​ఫోన్​ ధర ఎంతంటే..?

టెక్నో స్పార్క్​ గో 2024 ఎడిషన్​.. గ్రావిటీ బ్లాక్​, మిస్టరీ వైట్​ కలర్స్​లో అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్​ సేల్స్​.. అమెజాన్​తో పాటు వివిధ రీటైల్​ ఔట్​లెట్స్​లో ఈ నెల 7న ప్రారంభమవుతాయి. కాకపోతే.. వీటి ధరలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. సేల్స్​ టైమ్​లో క్లారిటీ వస్తుంది. ఫీచర్స్​ని చూస్తుంటే మాత్రం.. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్​గా కనిపిస్తోంది.

TECNO Spark Go 2024 launched : మార్కెట్​లో.. టెక్నా స్పార్క్​ గో 2023 3జీబీ ర్యామ్​- 32జీబీ స్టోరేజ్​ ధర రూ. 6,999గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం