Tecno Spark 10 5G: తక్కువ ధరకే నయా టెక్నో 5జీ ఫోన్ లాంచ్: ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే
Tecno Spark 10 5G launched: టెక్నో స్పార్క్ 10 5జీ ఫోన్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో వచ్చింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో అడుగుపెట్టింది.
Tecno Spark 10 5G launched: తక్కువ ధరలో 5జీ మొబైల్ కావాలనుకునే వారి కోసం మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. టెక్నో స్పార్క్ 10 5జీ ఇండియాలో విడుదలైంది. రూ.13వేలలోపు ధరతోనే అడుగుపెట్టింది. 90 హెర్ట్జ్ హెచ్‍డీ+ డిస్‍ప్లే, 5000mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తోంది. ఆండ్రాయిడ్ 13ను కలిగి ఉంది. టెక్నో స్పార్క్ 10 5జీ వివరాలు ఇవే.
టెక్నో స్పార్క్ 10 5జీ స్పెసిఫికేషన్లు
Tecno Spark 10 5G Specifications: 6.6 ఇంచుల HD+ IPS LCD డిస్‍ప్లేతో టెక్నో స్పార్క్ 10 5జీ వస్తోంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 480 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 6020 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‍తో వస్తోంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 4జీబీ వరకు అదనంగా వర్చువల్ ర్యామ్‍ను పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 12.6 ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ టెక్నో ఫోన్ వస్తోంది.
Tecno Spark 10 5G: టెక్నో స్పార్క్ 10 5జీ మొబైల్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరో ఐఏ లెన్స్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 10 5జీ బ్యాండ్లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
Tecno Spark 10 5G: టెక్నో స్పార్క్ 10 5జీ ఫోన్‍లో 5000mAh బ్యాటరీ ఉంది. 18 వాట్ల ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 50 నిమిషాల్లో ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని టెక్నో పేర్కొంది. హై-రెజ్ సపోర్ట్ ఉండే స్పీకర్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. డ్యయల్ సిమ్ 5జీ, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ టెక్నో నయా 5జీ ఫోన్ వస్తోంది.
టెక్నో స్పార్క్ 10 5జీ ధర, సేల్
Tecno Spark 10 5G Price, Sale: 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉండే టెక్నో స్పార్క్ 10 5జీ ఫోన్ ధర రూ.12,999గా ఉంది. మెటా బ్లాక్, మెటా బ్లూ, మెటా వైట్ కలర్లలో లభిస్తుంది. ఏప్రిల్ 7వ తేదీన దేశంలోని అన్ని పార్ట్‌నర్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ సేల్‍కు అందుబాటులోకి వస్తుందని టెక్నో పేర్కొంది.