Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్ 30 సిరీస్ లాంచ్- ధర ఎంతంటే..
Tecno Camon 30 premier : 50 ఎంపీ సెల్ఫీ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లు, ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందించే టెక్నో కామోన్ 30 5జీ, కామోన్ 30 ప్రీమియర్ 5జీ స్మార్ట్‌ఫోన్స్.. ఇండియాలో లాంచ్ అయ్యాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
Tecno Camon 30 premier 5G : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో కొత్త గ్యాడ్జెట్ ఎంట్రీ ఇచ్చింది. టెక్నో తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ టెక్నో కామోన్ 30 5జీ, కామోన్ 30 ప్రీమియర్ 5జీలను భారత్‌లో లాంచ్ చేసింది. హై-రిజల్యూషన్ కెమెరాలు, పవర్ఫుల్ ప్రాసెసర్లతో సహా అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త మోడల్స్.. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన పోటీదారులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టెక్నో కామోన్ 30 సిరీస్- ధరల వివరాలు..
టెక్నో కామోన్ 30 5జీ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.26,999. హై ఎండ్ కామోన్ 30 ప్రీమియర్ స్మార్ట్‌ఫోన్ 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.39,999.
రూ.3,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో మే 23 నుంచి ఈ రెండు స్మార్ట్ఫోన్లు భారత్‌లో కొనుగోలు చేయవచ్చు.
'టెక్నో కామోన్ 30 సిరీస్- ఫీచర్స్..
Tecno Camon 30 price in India : టెక్నో కామోన్ 30 5జీ సిరీస్‌లో ఆకట్టుకునే డిస్ప్లే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్లో 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమోఎల్ఈడీ స్క్రీన్, 1,080×2,436 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. కామోన్ 30 ప్రీమియర్ 5జీ కొంచెం చిన్న 6.77 ఇంచ్ 1.5కె ఎల్టీపీఓ అమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 1,264×2,780 పిక్సెల్స్ అధిక రిజల్యూషన్ కలిగి ఉంది.
టెక్నో కామోన్ 30 సిరీస్- పర్ఫార్మెన్స్..
టెక్నో కామెన్ 30 సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్స్.. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైఓఎస్ 14 పై పనిచేస్తాయి. ఇది సున్నితమైన, తాజా వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. టెక్నో కామోన్ 30 5జీ 6 ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే ప్రీమియర్ మోడల్ మరింత శక్తివంతమైన 4 ఎన్ఎమ్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్‌ను కలిగి ఉంది. ఇది వేగవంతమైన పనితీరు, మెరుగైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
కెమెరా సామర్థ్యాలు..
Tecno Camon 30 premier price : టెక్నో కామోన్ 30 సిరీస్ ప్రత్యేకతలలో ఒకటి దాని కెమెరా సెటప్! ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తున్నాయి. హై క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అనువైనవి. స్టాండర్డ్ కామోన్ 30 5జీ వెనుక భాగంలో డ్యూయెల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. అయితే ప్రీమియర్ మోడల్స్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
బ్యాటరీ- ఛార్జింగ్..
టెక్నో కామోన్ 30 5జీ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లోని రెండు మోడళ్లు 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది 70 వాట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని ద్వారా యూజర్లు తమ డివైజ్‌లను త్వరగా రీఛార్జ్ చేసుకుని రోజంతా వాడుకోవచ్చు.
ఇతర ఫీచర్స్..
Tecno Camon 30 series : వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, జీఎన్ఎస్ఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు ఈ రెండు ఫోన్ల కనెక్టివిటీ ఆప్షన్లలో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి వివిధ సెన్సార్లు కూడా ఈ టెక్నో కామోన్ 30 స్మార్ట్‌ఫోన్స్‌లో ఉన్నాయి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
సంబంధిత కథనం