Moto G64 5G : మోటో జీ64 లాంచ్​- స్పెసిఫికేషన్స్​, ధర చెక్​ చేసేయండి..-tech news moto g64 5g launched in india check price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Moto G64 5g : మోటో జీ64 లాంచ్​- స్పెసిఫికేషన్స్​, ధర చెక్​ చేసేయండి..

Moto G64 5G : మోటో జీ64 లాంచ్​- స్పెసిఫికేషన్స్​, ధర చెక్​ చేసేయండి..

Sharath Chitturi HT Telugu
Apr 16, 2024 01:40 PM IST

Moto G64 5G launched in India : మోటోరోలా జీ64 ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​​ ఫీచర్స్​, ధరతో పాటు సేల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటో జీ64 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే!
మోటో జీ64 లాంచ్​.. ధర, ఫీచర్స్​ వివరాలివే! (Motorola)

Moto G64 price in India : కొన్ని వారాలుగా కొనసాగుతున్న రూమర్స్​కి చెక్​ పెడుతూ.. సరికొత్త స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్​ చేసింది మోటోరోలా. దీని పేరు మోటో జీ64. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. మోటో జీ62, మోటో జీ54 వంటి మిడ్-రేంజ్ సెగ్మెంట్​ గ్యాడ్జెట్స్​ నుంచి ఈ మొబైల్​ ఇన్స్​పిరేషన్​ తీసుకున్నట్టు కనిపిస్తోంది. మోటో జీ 64 5జీ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి.. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్. ఇది భారతదేశంలో మొట్టమొదటిదని కంపెనీ పేర్కొంది. ఫీచర్ల నుంచి ధర వరకు.. ఈ మోటో జీ64 5జీ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటో జీ64 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

మోటో జీ64 5జీలో 6.5 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఐపీఎస్ ఎల్​సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటివి ఉన్నాయి. ఈ ప్యానెల్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది. టచ్ శాంప్లింగ్ రేటు 240 హెర్ట్జ్ కు మద్దతు ఇస్తుంది. ఇందాక చెప్పినట్టు.. ఈ మోటో జీ64 5జీ స్మార్ట్​ఫోన్​.. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది భారతదేశంలో మొదటిది అని కంపెనీ పేర్కొంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఎల్​పీడీడీ ఆర్​4ఎక్స్​ వంటివి ఈ గ్యాడ్జెట్​ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్​కి.. ఆండ్రాయిడ్ 15కు అప్​గ్రేడ్ చేస్తామని, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్​డేట్స్ ఇస్తామని సంస్థ చెబుతోంది.

Moto G64 price : మోటో జీ64 5జీ స్మార్ట్​ఫోన్​లో.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ ఓఐఎస్, 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్​తో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తోంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. మోటో జీ64 5జీలో ఐపీ52 వాటర్ రెసిస్టెన్స్, 14 5జీ బ్యాండ్లతో కంపాటబిలిటీ, డాల్బీ అట్మాస్, మోటో స్పేషియల్ సౌండ్, బ్లూటూత్ వీ5.3, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ వంటి ఫీచర్లు సైతం ఉన్నాయి. యూఎస్బీ టైప్-సీ ద్వారా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

మోటో జీ64 5జీ ధర, సేల్​..

మోటో జీ64 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ.14,999. ఇక 12 జీబీ+256 జీబీ స్టోరేజ్​ ధర రూ.16,999గా ఉంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్, ఈఎంఐ లావాదేవీలపై రూ.1100 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఒకవేళ ఈ ఆఫర్ వద్దనుకుంటే.. ఫ్లిప్​కార్ట్​లో అదనంగా రూ.1000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.

Moto G64 5G speicifications : మోటో జీ64 5జీ ఏప్రిల్ 23 నుంచి ఫ్లిప్​కార్ట్​, Motorola.in, ఆఫ్​లైన్​ రిటైల్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటలకు కొనుగోలు చేయవచ్చు.

మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ మోటోరోలా సంస్థ ఫోకస్​ చేసినట్టు కనిపిస్తోంది. ఫలితంగా.. ఈ సెగ్మెంట్​లో పోటీ మరింత పెరుగుతోంది. మరి ఈ కొత్త స్మార్ట్​ఫోన్​కి డిమాండ్​ ఎలా ఉంటుందో చూడాలి.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానల్స్​లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్స్​ని మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి. వాట్సప్ లో హెచ్​టీ తెలుగు ఛానల్​ని అనుసరించండి.

WhatsApp channel

సంబంధిత కథనం