Dell layoffs: డెల్ లో 12,500 మంది ఉద్యోగుల తొలగింపు; ఏఐ వైపు షిఫ్ట్ కావడమే కారణం
ప్రముఖ టెక్ సంస్థ డెల్ తన ఉద్యోగుల్లో నుంచి దాదాపు 10 శాతం ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించింది. పలు దేశాల్లోని డెల్ ఉద్యోగుల్లో సుమారు 12,500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. సేల్స్ టీమ్ లను కేంద్రీకృతం చేయడానికి, కొత్త AI-ఫోకస్డ్ సేల్స్ యూనిట్ ను సృష్టించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చెప్పింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై దృష్టిని పెంచడానికి, కంపెనీ కార్యకలాపాలను ఆధునీకరించడానికి డెల్ తన అమ్మకాల విభాగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా సేల్స్ టీమ్ లను కేంద్రీకృతం చేయడానికి, కొత్త AI-ఫోకస్డ్ సేల్స్ యూనిట్ ను సృష్టించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెల్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమో షేరింగ్ లో డెల్ తెలియజేసింది.
12,500 మందిపై వేటు
అయితే, ఈ నిర్ణయంలో భాగంగా ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నారనే విషయాన్ని డెల్ వెల్లడించలేదు. అయితే డెల్ ఉద్యోగుల్లో 10 శాతం మంది అంటే దాదాపు 12,500 మందిపై వేటు పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. 'గ్లోబల్ సేల్స్ మోడర్నైజేషన్ అప్డేట్' పేరుతో ఈ మెమోను డెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు బిల్ స్కాన్నెల్, జాన్ బైర్న్ ఉద్యోగులకు పంపారు. డెల్ సేల్స్ విభాగానికి చెందిన పలువురు ఉద్యోగులను తొలగించినట్లు లేదా ప్రభావితమైన సహోద్యోగులను గుర్తించినట్లు నివేదిక తెలిపింది.
ముఖ్యంగా సేల్స్ టీమ్ పై ప్రభావం
ఉద్యోగుల తొలగింపు (layoffs) ప్రధానంగా మేనేజర్లు, సీనియర్ మేనేజర్లపై ప్రభావం చూపిందని, వీరిలో కంపెనీలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది మేనేజర్లు, డైరెక్టర్లు, వీపీ లేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ లేఆఫ్ నిర్ణయం ప్రధానంగా మార్కెటింగ్ కార్యకలాపాలపైనా ప్రభావం చూపింది. ఇప్పుడు ప్రతి మేనేజర్ టీమ్ లో కనీసం 15 మంది ఉద్యోగులు ఉన్నారు.
ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగులను తొలగిస్తున్నారా?
2023 ఫిబ్రవరి నుండి డెల్ తన ఉద్యోగులను 130,000 నుండి సుమారు 120,000 కు తగ్గించింది. ఉద్యోగుల తొలగింపు పై కంపెనీ నిరవధిక కసరత్తు కొనసాగిస్తోందని, దాదాపు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంపెనీ టీమ్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా డెల్ (dell) లే ఆఫ్స్ ప్రకటిస్తోందని తెలుస్తోంది.