TCS buyback of shares: బై బ్యాక్ రికార్డ్ డేట్ ను ప్రకటించిన టీసీఎస్.. ఇప్పుడు కొనొచ్చా?
TCS buyback of shares: షేర్స్ బై బ్యాక్ ను టీసీఎస్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఈ బై బ్యాక్ కు సంబంధించిన రికార్డు డేట్ ను కూడా వెల్లడించింది.
TCS buyback of shares: భారతీయ ఐటీ మేజర్ తమ షేర్స్ బైబ్యాక్ రికార్డ్ తేదీని ప్రకటించింది. బైబ్యాక్ రికార్డ్ తేదీ (TCS buyback record date) నవంబర్ 25వ తేదీ అని వెల్లడించింది. ఈ IT దిగ్గజం ఇప్పటికే ఒక్కో షేరుకు రూ.4150 చొప్పున షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఈరోజు TCS షేర్ ధర NSEలో దాదాపు రూ. 3,425గా ఉంది, అంటే TCS బైబ్యాక్ ప్రస్తుతం 20 శాతం కంటే ఎక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంది.
బై బ్యాక్ పై ఏ నిర్ణయం తీసుకోవాలి..
టీసీఎస్ బై బ్యాక్ (TCS buyback) పై ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్ష్కర్ మాట్లాడుతూ, "అమెరికా, యూరప్ లలో టిసిఎస్ ప్రధాన వ్యాపారాన్ని కలిగి ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున రాబోయే కొద్ది త్రైమాసికాల్లో టీసీఎస్ పనితీరు మందగమనంతో సాగే అవకాశం ఉంది. కాబట్టి, టీసీఎస్ షేర్లు మరికొన్ని క్వార్టర్ల వరకు కన్సాలిడేషన్ దశలోనే ఉంటాయని భావిస్తున్నారు. అందువల్ల, టీసీఎస్ షేర్‌హోల్డర్‌లకు స్వల్పకాలిక ప్రయోజనాలను పొందేందుకు ఈ టీసీఎస్ బైబ్యాక్ ఒక మంచి అవకాశం. మరీ ముఖ్యంగా, ఈ షేర్ల బైబ్‌వాక్ ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది" అని వివరించారు.
టీసీఎస్ ఔట్ లుక్
టీసీఎస్ షేరు ధర ఔట్‌లుక్‌పై, ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా మాట్లాడుతూ, "ప్రస్తుతం రూ. 3425 వద్ద ట్రేడవుతున్న టిసిఎస్ షేర్ ధర ఇటీవల బలమైన బ్రేక్‌అవుట్‌కు గురైంది. టీసీఎస్ ప్రస్తుతం 20-రోజులు, 200-రోజుల EMAలతో సహా కీలకమైన ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ (EMAలు) కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఈ సానుకూల మూమెంట్ కొనసాగుతుంది" అని వివరించారు. షేర్ల బైబ్యాక్ కారణంగా టిసిఎస్ షేర్లలో కొంత కొనుగోళ్లు జరగవచ్చని, స్వల్పకాలంలో ఒక్కోషేరు విలువ రూ.3570 వరకు పెరగవచ్చని బగాడియా చెప్పారు. ఒక్కో షేరు స్థాయిలకు రూ.3320 వద్ద స్టాప్ లాస్‌ను కొనసాగించాలని టీసీఎస్ షేర్‌హోల్డర్లకు ఆయన సూచించారు. వాస్తవానికి, ఎవరైనా TCS బైబ్యాక్ ప్రయోజనాన్ని పొందాలని ప్లాన్ చేస్తే, ప్రస్తుత స్థాయిలలో TCS షేర్లను రూ. 3320 స్థాయిల వద్ద స్టాప్ లాస్‌ను కొనసాగిస్తూ కొనుగోలు చేయవచ్చన్నారు.
బై బ్యాక్ వివరాలు..
బై బ్యాక్ వివరాలను టీసీఎస్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ కు ఒక లేఖలో తెలిపింది. రూ. 1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 4,150 చొప్పున చెల్లిస్తూ 4,09,63,855 షేర్లను బై బ్యాక్ చేయనున్నట్లు టీసీఎస్ తెలిపింది. వీటి కోసం సుమారు రూ. 17 వేల కోట్లను చెల్లించనున్నట్లు తెలిపింది.
సూచన: ఇది నిపుణుల సూచనలు, సలహాలతో కూడిన కథనం. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.
టాపిక్