TCS Q3 results and dividend: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన మూడో మధ్యంతర డివిడెండ్ ఇష్యూతో పాటు ప్రత్యేక డివిడెండ్ ఇష్యూను గురువారం ప్రకటించింది. ఈక్విటీ షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ ఇష్యూతో పాటు రూ.1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.66 ప్రత్యేక డివిడెండ్ ను కంపెనీ ప్రకటించింది. "ఈ రోజు జరిగిన బోర్డు సమావేశంలో, డైరెక్టర్లు కంపెనీ యొక్క రూ .1 ఈక్విటీ షేరుకు రూ .10 మూడవ మధ్యంతర డివిడెండ్ మరియు రూ .66 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించారని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము’’ అని బిఎస్ఇ ఫైలింగ్ లో టీసీఎస్ తెలిపింది.
TCS బోర్డు ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్ మరియు రూ.66 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. గతంలో టీసీఎస్ FY25 లో Q1 లో రూ. 10, Q2లో రూ. 10 డివిడెండ్ లను ప్రకటించింది. మూడవ మధ్యంతర డివిడెండ్, ప్రత్యేక డివిడెండ్‌ను ఫిబ్రవరి 3, 2025 సోమవారం చెల్లిస్తామని కంపెనీ చెప్పింది. ఈ డివిడెండ్ (dividends) చెల్లింపునకు రికార్డు డేట్ శుక్రవారం, జనవరి 17, 2025 అని వెల్లడించింది.
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) డిసెంబర్ త్రైమాసికం (Q3) గణాంకాలను గురువారం ప్రకటించింది. టీసీఎస్ క్యూ3 ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. ఈ క్యూ 3 లో టీసీఎస్ రూ. 12,380 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్యూ 3 ఐటి కంపెనీలకు సీజన్ పరంగా బలహీనమైన త్రైమాసికం అయినప్పటికీ, టీసీఎస్ గణనీయ లాభాలను సాధించగలిగింది.