Smart TVs: 24 వాట్ల స్పీకర్లు, బెజిల్‍లెస్ డిజైన్‍తో టీసీఎల్ నయా స్మార్ట్ టీవీలు లాంచ్.. బడ్జెట్ రేంజ్‍లో..
TCL S Series Smart TVs: టీసీఎల్ ఎస్ సిరీస్‍లో కొత్తగా మూడు స్మార్ట్ టీవీలు లాంచ్ అయ్యాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 24 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లను ఈ టీవీలు కలిగి ఉన్నాయి.
TCL S Series Smart TVs: టీసీఎల్ బ్రాండ్ ఇండియాలో కొత్తగా ఎస్ సిరీస్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఈ సిరీస్‍లో 32 ఇంచుల డిస్‍ప్లేతో మూడు మోడళ్లను బడ్జెట్ రేంజ్‍లో తీసుకొచ్చింది. టీసీఎల్ ఎస్5400 (TCL S5400), టీసీఎల్ ఎస్5400A (TCL S5400A), టీసీఎల్ ఎస్5403ఏ (TCL S5403A) పేర్లతో ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు విడుదలయ్యాయి. డిస్‍ప్లే చుట్టూ అంచులు సన్నగా ఉండే బెజిల్‍లెస్ డిజైన్‍తో ఈ టీవీలు అడుగుపెట్టాయి. లుక్‍పరంగా ప్రీమియమ్‍గా కనిపిస్తున్నాయి. టీసీఎల్ నయా టీవీల ధరలు, స్పెసిఫికేషన్‍ల గురించి ఇక్కడ చూడండి.
టీసీఎల్ ఎస్ సిరీస్ స్మార్ట్ టీవీల స్పెసిఫికేషన్లు
TCL S Smart TVs Specifications: టీసీఎల్ ఎస్ సిరీస్‍లోని ఈ మూడు స్మార్ట్ టీవీలు 32 ఇంచుల బెజిల్‍లెస్ డిస్‍ప్లేను కలిగి ఉన్నాయి. మాక్రో డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కాగా, ఎస్5400 మోడల్ డిస్‍ప్లే ఫుల్ హెచ్‍డీ స్క్రీన్ రెజల్యూషన్‍ను కలిగి ఉంది. ఎస్5400ఏ, ఎస్5403ఏ హెచ్‍డీ రెడీ రెజల్యూషన్ డిస్‍ప్లేలను కలిగి ఉన్నాయి.
TCL S Smart TVs Specifications: టీసీఎల్ ఎస్5400 స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆధారిత గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‍పై రన్ అవుతుంది. ఇక మిగిలిన రెండు టీవీలు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తున్నాయి. ఈ మూడు టీవీలు గూగుల్ క్రోమ్‍కాస్ట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్‍కు సపోర్ట్ చేస్తాయి. టీసీఎల్ ఎస్5400 టీవీలో 1.5 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఎస్5400ఏ, ఎస్5403ఏ టీవీలు 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‍తో వస్తున్నాయి.
TCL S Smart TVs Specifications: 24 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ మూడు టీవీల్లో ఉన్నాయి. డాల్బీ ఆడియోకు ఈ టీసీఎల్ టీవీలు సపోర్ట్ చేస్తాయి. వైఫై, బ్లూటూత్, రెండు హెచ్‍డీఎంఐ పోర్టులు, ఓ యూఎస్‍బీ పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‍స్టార్ సహా దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లకు ఈ టీవీలు సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్ చేసే యాప్‍లు, గేమ్‍లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
టీసీఎల్ ఎస్ సిరీస్ స్మార్ట్ టీవీల ధరలు
TCL S Series Smart TVs Price: టీసీఎల్ ఎస్5400 టీవీ ధర రూ.15,990గా ఉంది. ఎస్5400ఏ ధర రూ.13,490, ఎస్5403ఏ మోడల్ ధర రూ.13,990గా ఉంది. ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లో ఈ టీవీలు సేల్‍కు వచ్చాయి. ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ లభిస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్